అరిగెల కవన వనం

అరిగెల కవన వనం అరిగెల గదాధర్ వ్రాసిన కవితలు పాటలు

26/01/2026

గదాధర్ అరిగెల
శీర్షిక: జయహో భారత్…!
దేశభక్తిని అణువణువున నింపుకుని,
భారత శక్తిని విశ్వానికి చాటుకుని,
డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని
గర్వంగా ఘనంగా జరుపుకుంటూ…
వందేమాతరం గీతం నాదమై మార్మోగగా,
అడుగడుగున మన సంస్కృతి–సంప్రదాయాల
అద్భుత ప్రదర్శనతో,
సాంకేతిక పరిజ్ఞాన విన్యాసాలతో,
సైనిక బల–యుక్తుల పరాక్రమంతో,
నవనారీ శక్తి ప్రభంజనంతో,
వాయు బలానికి గరుడ అండగా నిలిచి,
వివిధ దళాల ఆత్మనిర్భర భారత్ శక్తిని
ప్రపంచానికి చాటి చెప్పిన
అబ్బురపరిచే, ఒళ్ళు గగుర్పరుస్తూ
డిల్లీ గడ్డపై భారత్ బిడ్డల విన్యాసం…
నభూతో నభవిష్యత్ అనిపించిన వేడుక,
“జయహో భారత్” అంటూ నినదించిన గొంతులు,
హర్షాతిరేకంతో కనులు చెమర్చగా
మనసు మౌనంగా పలికెను—
వందేమాతరం…!
ఉప్పొంగెను జాతీయ భావం…!
అందరికీ గణతంత్ర దినోత్సవ
శుభాకాంక్షలంటూ
కవి స్పందించెను—
కలం మురిసెను… కదా… గదా…!
జై హింద్ 🇮🇳
🌻🌻🙏🙏🙏🌻🌻

Address

Visakhpatnam
Visakhapatnam
530046

Website

Alerts

Be the first to know and let us send you an email when అరిగెల కవన వనం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category