Aghor akhada

Aghor akhada this is the page of Parama Pujya Sri Sri Sri Rajesh Nath ji Aghori who is Pramukh of Aghor Akhada

🏵ఈశ్వరుడు ఇచ్చిన సంపద🏵ఈ ప్రకృతి యావత్తు ఈశ్వరుడు ఇచ్చిన సంపదే. ప్రకృతిలో ఏమున్నాయి... భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అ...
16/03/2022

🏵ఈశ్వరుడు ఇచ్చిన సంపద🏵

ఈ ప్రకృతి యావత్తు ఈశ్వరుడు ఇచ్చిన సంపదే. ప్రకృతిలో ఏమున్నాయి... భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే "పంచభూతాలు" ఉన్నాయి. ఇంకా వృక్షాలు, జంతువులు, పర్వతాలు, నదులు, సముద్రాలు, సూర్యచంద్రులు.. ఈ మొత్తం ప్రకృతి సంపదయే. దీనిని ఇచ్చింది భగవంతుడేగాని ఏ సైంటిస్ట్ స్వయంగా తయారు చేయలేదు.

వీటన్నింటిని ఎందుకు ఇచ్చినట్లు...

1) భూమి...

భూమి మనకు ఆధారంగా ఉంటున్నది. కూర్చోటానికి, నిలుచోటానికి, ప్రయాణం చేయటానికి, ఇళ్ళు కట్టుకొని నివాసం ఉండటానికి ఈ భూమియే ఆధారం. ఇంకా భూమి నుండే మనం తినే ఆహారం వస్తున్నది. సస్యాలు, కాయకూరలు, పండ్లు మొదలైనవి వన్నీ వస్తున్నవి. భూమి నుండే ఖనిజాలు వస్తున్నాయి. ఇవన్నీ మానవుడు ఉపయోగింకుంటున్నాడు.

2) నీరు...

నీరు మానవుడికి, ఇతర ప్రాణులకు దప్పికదీరుస్తున్నది. ఈ నీరే చెట్లకు కూడా కావాలి. మానవ మనుగడకు నీరు ఎంతో అవసరం.

3) అగ్ని...

ఆహారాన్ని పచనం చేయటానికి అగ్ని అవసరం. అలాగే మన శరీరంలో 98.4F అగ్ని ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండేది. అగ్ని లేకపోతే - శరీరం చల్లబడితే కట్టె అయిపోతుంది.

4) వాయువు...

ముఖ్యంగా ప్రాణికోటి జీవనానికి తప్పనిసరి అవసరం. గాలి లేకపోతే శరీరం చెమటలు పట్టి ప్రశాంతంగా ఉండలేం. అంతేగాదు బయటనున్న ఈ వాయువే మన ముక్కు రంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించి ప్రాణవాయువుగా మారుతుంది. జీవన చర్యలకు సాయపడుతుంది.

5) ఆకాశం...

మనం ఈ భూమి మీద తిరగటానికి అవకాశం కలిగించేదే ఆకాశం. శబ్దాలు వినపడాలంటే ఆకాశం ఉండాలి.

6) వృక్షాలు...

మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వృక్షాలు కాయకూరలు, పండ్లు, పూలు, మాత్రమేగాక రకరకాల ఔషధాలను ఇచ్చే ఔషధవృక్షాలు కూడా ఉన్నాయి. అనేక రకాల జబ్బులకు వాడే ఆయుర్వేద మందులలోను, కొన్ని ఇంగ్లీషు మందులలో కూడా ఈ ఓషధీ మొక్కలను వాడుతారు. ఇంకా వృక్షాలు నీడనిస్తాయి. వంటచెరకునిస్తాయి. గృహ నిర్మాణాలలో ద్వారాలు, తలుపులు, కిటికీలు అన్నీ ఈ వృక్షాల ద్వారానే.

7) జంతువులు...

అనేక జంతువులు మానవులకు ఉపయోగపడతాయి. వ్యవసాయంలో సాయంచేస్తాయి. పాలు పెరుగు, వెన్న నెయ్యి జంతువుల ద్వారానే వస్తాయి. కుక్కలు ఇంటి కాపలాగా కొన్ని జాతులు దొంగలను పట్టటానికి ఉపయోగపడతాయి.

8) పర్వతాలు...

అనేక ఔషధాలనిస్తాయి. మేఘాలను అడ్డగించి వర్షాన్నిస్తాయి. కొన్ని రక్షణగా ఉంటాయి.

9) నదులు సముద్రాలు...

సముద్రాల వల్ల అనంత జలరాశి లభ్యం. సముద్రంలోని నీరే వేడెక్కి మేఘాలుగా ఏర్పడి వర్షిస్తాయి. ఆ వర్షం నదులకు చేరుతుంది. ఆ నీరు త్రాగటానికి, పంటలకు ఉపయోగపడుతుంది. ఆనకట్ట కట్టి, కరెంటు తయారు చేయవచ్చు.

10) సూర్యచంద్రులు...

ప్రపంచాన్ని వెలిగించి చూపేవారు సూర్య చంద్రులు. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు వెలుగునిస్తాడు. సూర్యుడు వేడిని, చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఆహ్లాదం కలిగిస్తాడు. చంద్రుని కిరణాల వల్ల కొన్ని పంటలు బాగా పండుతాయి. సూర్యుని లేలేత కిరణాలు శరీరానికి మేలుచేస్తాయి.

ఈ విధంగా ప్రకృతి అంతా మానవులకు మేలు కలిగించేదే. ఈ ప్రకృతి మానవుల మేలుకోసం, మానవుల మనుగడ కోసం భగవంతుని చేతనే ప్రసాదించబడింది.

ఇవన్నీ గాక మానవుడికి భగవంతుడు మరొక మేలు చేస్తున్నాడు. అదేమిటంటే మనం హాయిగా తిని పడుకుంటే మనలోనే ఉన్న పరమాత్మ జఠరాగ్ని రూపంలో ఉండి మనం తిన్న ఆహారాన్ని అరిగించి, సారాన్ని రక్తంలో కలిపి మన దేహము నందంతటా ప్రసరింపజేస్తూ అన్ని అవయవాలకు శక్తిని ప్రసాదిస్తున్నాడు. పనికిరాని పిప్పిని బయటకు పంపటానికి సిద్ధం చేస్తున్నాడు. ఇన్ని విధాలుగా మనకు ప్రకృతిని ప్రసాదించి, రక్షించే ఈశ్వరుడు ని స్మరించటం ప్రతి మానవుడి కనీస భాద్యత.. అదే కృతజ్ఞతగా నమస్కరించుట...

🙏🏻ఓం నమః శివాయ🙏🏻

*శివుడు అర్థమైతే - సత్యం అర్థమవుతుంది!!!*గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత...
16/03/2022

*శివుడు అర్థమైతే - సత్యం అర్థమవుతుంది!!!*

గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనంద మూర్తి. ఆదిత్య వర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. సర్వుడు.

“ఇట్టి పరమేశ్వరుని కన్న పెద్ద గానీ, చిన్న గానీ సాటి గానీ ఎవరూ లేరు. సర్వ ప్రాణుల యందు అణువణువు నందు నిండిన స్వయం ప్రకాశక సదానంద మూర్తి. మోక్షార్ధి అయిన వాడు ఆశ్రయించ దగ్గ ఏకైక విరాడ్రూపుడు ఆ పరమేశ్వరుడొక్కడే! శివ తత్వ జిజ్ఞాసువులకు సైతం అందినట్టే అంది, అగోచరమయ్యే మహా మూర్తి మంతమైన తత్వం ఆయనది. అట్టి శివ తత్వం లోని కొన్ని విషయాలని పరిశీలిద్దాం.

1. జ్యోతిర్లింగాలు: శివుడిని 12 జ్యోతిర్లింగ రూపాలలో వున్నాడని నమ్మి కొలుస్తారు. జ్యోతిర్లింగ అంటే చీకటిని (అజ్ఞానాన్ని) చీల్చి వెలుగు…( జ్ఞానాన్ని) ప్రసాదించేది.

2.లింగాకారం: శివ లింగం పైకి లింగం కింద పానవట్టం యోని రూపంలో వుంటుంది. అది స్త్రీ పురుషుల ప్రతీక. ఒకటి లేనిది ఇంకొకటి లేదు.అవినాభావ సంబంధం.

3. ప్రళయం: శివుడ్ని ప్రళయ కారకుడు గా నమ్ముతారు. ప్రళయ కారకుడని తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? శివుడు మూడు ప్రళయము లకు కారణం. ఒకటి రాత్రి నిద్ర. అన్ని ప్రాపంచిక మాయల నుండి మరపు నిచ్చేది. రెండు శారీరక మరణం.స్థూల (అంగ శరీరం) , సూక్ష్మ ( మనసు), కారణ ( అజ్ఞానం)శరీరాలనుంచి విముక్తి కలుగచేసేది. మూడు : మహాప్రళయం : సమస్తం శివుని లో కలిసిపోవడం. అంతరార్ధం: ఈ మూడు శరీరాలు మాయకల్పితం, అశాశ్వతం కావటం వలన, శివుడు వాటినుంచి విముక్తి కల్పించడం.

4. శివ,విష్ణు,బ్రహ్మ : శివుడి నించి విష్ణువు, విష్ణువు నించి బ్రహ్మ ఆవిర్భవించారంటారు. బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు నడిపించడం, శివుడు అంతం చేయటం అనేవి లోకోక్తి. అంతరార్ధం : సృష్టి, స్థితి,లయ ఒకచోట నుంచి రావటం, మరలా అందులోకి పోవటం.

5. మరణం ఒక వేడుక : వారణాసిలో ఘాట్లను చూస్తే, ప్రపంచంలో అదొక్కటే స్థలం లో జీవిత చక్రంలోని అన్ని దశలు : జన్మ , పెరగటం, మరణం అన్నీ నది ఒక చివరనుంచి ఇంకో చివరలోపు కనిపిస్తాయి. ఉజ్జయిన్ లో శివునికి జరిగే భస్మ హరతికి…. ముందు రోజు ఖననం చేసిన శరీర భస్మాన్ని తెచ్చి వాడతారు. శివుడు తన శరీరమంతా భస్మాన్ని అలుముకుంటాడు.

6. పంచభూత లింగాలు : దక్షిణ భారతం లోనున్న పంచ భూత లింగాలు ( అగ్ని, వాయు, భూమి, ఆకాశం ,జలం ) ఆ అద్వితీయ శక్తి అన్ని ధాతువులలో, భూతాలలో ఉందని రుజువు చేస్తాయి. శివం కానిదింకేమైనా ఉందా ?

7. శక్తి సూత్రం : శక్తి ఒక రూపంనుంచి ఇంకో రూపానికి మారవచ్చు కానీ శక్తి తయారు కాబడదు. నాశనం కాబడదు. అద్వైతాన్ని ఇంతకంటే స్పష్టంగా సరళంగా చెప్పగలమా? ఒక జీవి, చెట్టు, రాయి, జాలం లోని ఆ పరబ్రహ్మం ఒకటే. పై తొడుగులు వేరు, అశాశ్వతం.

8. రుద్రం : శివుని పూజించే పద్దతులలో రుద్రం మొదటిది. రుద్రం లో ఏం వుంది ? మహాన్యాసం, నమకం ,చమకం. మహాన్యాసం అంటే: చేసేది శివుడే , నీవు శివుడవేనని నిర్ధారణ చేస్తుంది. ఆ తరవాతే మిగతావన్నీ. చమకమ్ లో ఏం వుంది? సమస్తమూ శివమే దొంగ, నురుగు, జీవులు అంతా ( అద్వైతం )

9. శివుని ధ్యానముద్ర: నీ నిజస్థితి తెలుసుకోవటానికి సాధనం శ్రవణ ,మనన, నిధి,ధ్యాసాలు (ధ్యానం) .

10. అద్వైతం : అద్వైతం తెలిపిన శంకరుల పేరు శివుని పేరు కావడం యాదృచ్చికమా ? జన్మ,స్థితి, మరణం - ఈ చక్రం మాయలో భాగం, అసత్యం. ఉన్నదొక్క బ్రహ్మమేనన్నదే సత్యం. తత్వమసి, శివోహం, అహం బ్రహ్మాస్మి అనే తత్వ వాక్యాలు చెప్పే సత్యం ఇదే ...

09/01/2022
08/01/2022

సాంకేతిక కారణాల వలన
Rajeshnathji aghori
ఫేస్బుక్ ప్రొఫైల్ నిలిచిపోయింది
సమాచారం కొరకు...ఈ పేజీ ని ఫాలో అవ్వండి

Address

Ujjain
Ujjain

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+917207834744

Website

Alerts

Be the first to know and let us send you an email when Aghor akhada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Aghor akhada:

Share