21/10/2024
హీరో చేతిలో తన్నులు తినే అమాయక ఫైటర్స్ బేసిక్ రూల్స్ -
1. హీరోని ఎప్పుడూ గుంపుగా అటాక్ చేయకూడదు. ఒకరి తర్వాత మరొకరు మాత్రమే అటాక్ చేయాలి.. తమ బ్యాచ్ లో ఒకడిని హీరో కొడుతుంటే మిగిలిన వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూ ఉండాలి..
2. ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే ఫైటర్లలో ఒకడు రేయ్ అని అరుస్తూ ఏదొక ఆయుధంతో అటాక్ చేయడానికి హీరోపైకి దూసుకురావాలి. హీరో వాడిని కొట్టగానే మిగిలిన ఫైటర్స్ వాడిని కొట్టిన విధానం చూసి భయపడాలి.
3. ఒక ఫైటర్ ను కొట్టే పనిలో హీరో బిజీగా ఉంటే వేరే ఫైటర్ wait చేయాలి తప్ప అటాక్ చేయకూడదు. ఒకవేళ వెనకనుండి అటాక్ చేయాల్సి వస్తే ‘రేయ్’ అని అరుస్తూ వెనకనుండి అటాక్ చేస్తున్నా అని హింట్ ఇవ్వాలి.. అప్పుడు హీరో అలర్ట్ అయి వాడిని కొట్టాలి.
4. ఒకేసారి హీరో నలుగురైదుగురు ఫైటర్స్ ని కొట్టాల్సి వస్తే ఎవడో ఒక ఫైటర్ హీరోని తనపై మోస్తూ అలా కొట్టేందుకు హెల్ప్ చేయాలి.
5. హీరో కొట్టే పిడి గుద్దులకు పక్కనే ఉన్న బెంచీలు, గ్లాసులపై పడి వాటిని ఖచ్చితంగా డ్యామేజ్ చేయాలి తప్ప సేఫ్ గా కిందపడడం ఫైట్స్ లో నిషిద్ధం...
6. ఒకవేళ హీరో ఫలానా విధంగా ఫైట్ చేయాలని ఛాలెంజ్ చేస్తే అలా నేనెందుకు చేయాలని ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా హీరో చెప్పిన టాస్క్ పూర్తి చేసేందుకు ఫైటర్స్ ప్రయత్నం చేయాలి. Ex. హీరోయిన్ ని టచ్ చేస్తే మీదే అని హీరో ఛాలెంజ్ చేస్తే ఫైటర్స్ హీరోయిన్ ని టచ్ చేయడానికి పోటీ పడి తన్నులు తినాలి తప్ప హీరోని అటాక్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇలాంటి కోవలోకే కళ్ళజోడు టచ్ చేసే ఫైట్, కాళ్ళు కిందపెట్టకుండా విలన్స్ ని దుమ్ము దులిపే రకరకాల ఫైట్స్ వస్తాయి..
7. పాత మూవీస్ లో అయితే హీరో ఏ వెహికల్ తో జీవనాధారం పొందితే ఆ వెహికల్ తో ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఆ ఫైట్ లో తప్పనిసరిగా ఆ వెహికల్ తో ఫైటర్స్ తన్నులు తినాలి.. ఉదాహరణకు హీరో రిక్షా తొక్కితే రిక్షా ఫైట్, ఆటో నడిపితే ఆటో ఫైట్, సైకిల్ నడిపితే సైకిల్ ఫైట్ కామన్ గా ఉంటాయి.. ఒకవేళ జంతువుల సాయం తీసుకుంటే వాటితో కూడా తన్నులు తినాలి.. ఉదాహరణకు గుర్రం, పొట్టేలు, కుక్క, కోతి ఇలా ఏ జంతువును హీరో పెంచినా వాటితో ఫైట్ కామన్..
8. టాస్క్ లో భాగంగా హీరోకి ఫైట్ లో కళ్ళు కనబడకపోతే రేయ్ అని అరవడమో లేదా ఏదొక చప్పుడు చేసి హీరోకి మేము ఫలానా దిశలో వస్తున్నామని హింట్ ఇవ్వడమో చేసి తన్నులు తినాలి.
మీకు తెలిసిన ఫైటర్ రూల్స్ కామెంట్ చేయండి.