13/06/2026
"చిప్స్ ప్యాకెట్‌కే రేటు ఉన్నప్పుడు, స్కూల్ ఫీజులకి ఎందుకు ధర ఉండదు?" అని సీఎం విజయ్ సూటిగా అడిగారు. స్కూళ్లు మళ్లీ తెరుచుకుంటున్న టైమ్‌లో ఆయన ఫీజుల టాపిక్‌పై కొన్ని ముఖ్యమైన కామెంట్స్ చేశారు. చిప్స్, చాక్లెట్లు లాంటి చిన్న చిన్న వాటికే రేట్లు క్లియర్‌గా రాసి పెడుతున్నప్పుడు, పిల్లల ఫ్యూచర్‌ని డిసైడ్ చేసే స్కూళ్లలో ఫీజుల వివరాలను ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతున్నారని ప్రశ్నించారు. కమిటీ ఫిక్స్ చేసిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని.. ఆ ఫీజుల వివరాలను స్కూల్ నోటీస్ బోర్డులో, అఫీషియల్ వెబ్‌సైట్‌లో, అడ్మిషన్ ఫారమ్‌లలో కచ్చితంగా అందరికీ కనిపించేలా పెట్టాలని ఆర్డర్ వేశారు. ఎవరైనా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని, రూల్స్ బ్రేక్ చేస్తే స్కూల్ పర్మిషన్ (గుర్తింపు) క్యాన్సిల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.