FILM News

FILM News this is all about telugu film industry news, in this there will be new updates of telugu film industry

తనికెళ్ల భరణి పేరు వింటేనే ఎక్కడికి వెళ్లారుగా గుర్తుకొస్తారు. అలాంటి ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు, సుఖ స...
14/07/2025

తనికెళ్ల భరణి పేరు వింటేనే ఎక్కడికి వెళ్లారుగా గుర్తుకొస్తారు. అలాంటి ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ప్రసాదించాలని కలియుగ దైవం వెంకటశ్వర స్వామిని వేడుకుంటున్నాం. తనికెళ్ల భరణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఫిలిం న్యూస్.

తనికెళ్ళ భరణి (జననం: 1954 జులై 14) రంగస్థల, సినిమా రచయిత, నటుడు. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు.ఇతను సకల కళాకోవిదుడు. ఇతనికి దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు.

ఈ ఫోటోలోని వ్యక్తి పేరు బత్తిన గోపీనాథ్ ఇతను కృష్ణానగర్లో నివాసం ఒక ఫ్లాట్ విషయంలో నా వద్ద మూడు లక్ష రూపాయలు తీసుకొని కన...
23/09/2024

ఈ ఫోటోలోని వ్యక్తి పేరు బత్తిన గోపీనాథ్ ఇతను కృష్ణానగర్లో నివాసం ఒక ఫ్లాట్ విషయంలో నా వద్ద మూడు లక్ష రూపాయలు తీసుకొని కనిపించకుండా ఫోన్ ఎత్తకుండా తిరుగుతున్నాడు ఎన్ని మెసేజ్లు పెట్టిన ఎన్ని చివాట్లు పెట్టినా స్పందించడం గట్టిగా ఫోన్ చేసి అడిగితే నేను పెద్ద దాన్నని చెబుతూ నీకు చేతనైంది చేసుకుంటూ తనమీద నాలుగు మర్డర్ కేసులు ఉన్నాయని చంపడానికి కూడా వెనకాడనంటూ నన్ను బెదిరిస్తున్నాడు ఇతని ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది ఫోన్ నంబర్ 9390811818 ఇదే ఇతను ఎక్కడ ఉన్నా చెప్పిన కూడా వారి ఫోన్ నెంబర్ కి ఫోన్ పే చేయడం జరుగుతుంది మీరు సంప్రదించవలసిన నెంబరు 9573376675

16/11/2021
16/11/2021

ఆమని ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు మరియు తమిళ చిత్రాలలో కనిపించింది. E. V. V. సత్యనారాయణ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం జంబ లకిడి పంబలో నరేష్ సరసన ప్రధాన పాత్రలో ఆమె తొలిసారిగా నటించింది. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆమె బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం చిత్రంలో నటించింది, ఇది తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది - శుభ లగ్నం చిత్రానికి తెలుగు మరియు శుభ సంకల్పం మరియు మిస్టర్ పెళ్లాం చిత్రాలకు ఉత్తమ నటిగా నంది అవార్డు లో పొందారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమని అందరి మన్ననలు పొంది ముఖ్యంగా తల్లి పాత్రలో తనకు తాను ఒదిగిపోయి ఆ పాత్రలకు న్యాయం చేసిందనే చెప్పాలి. ఆమని గారు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటోంది ఫిలిం న్యూస్

16/11/2021

సారీ ఫ్రెండ్స్ కొన్ని అనుకోని సంఘటనలు నా జీవితంలో చోటు చేసుకోవడం వల్ల ఫిలిం న్యూస్ పేజి ను అప్డేట్ చేయలేకపోయాను. ఫిలిం న్యూస్ పేజ్ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలియజేయడంతో పాటు ఉ రానున్న రోజుల్లో హరి క్రియేషన్స్ ఆధ్వర్యంలో వెబ్ సిరీస్ కు సంబంధించిన విషయాలను తెలియజేస్తా

12/02/2020
12/02/2020

, ఈరోజు జగపతిబాబు ఉ పుట్టినరోజు నేడు:
*బాల్యం*
ప్రముఖ హీరో మరియు నిర్మాత వీరమాచనేని జగపతి చౌదరి గారు 1962 ఫిబ్రవరి 12న కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రామంలో రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మించారు.
*నేపథ్యం*
జగపతి పిక్చర్స్ బ్యానర్ ద్వారా ఆణిముత్యాలను అందించిన ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ గారి తనయుడిగా సినీపరిశ్రమలో ప్రవేశం చేసి ఫ్యామిలీ స్టార్ గా శోభన్ బాబు తర్వాత అంతటి మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన వ్యక్తి జగపతి బాబు గారు. వీరు పుట్టింది మచిలీపట్నంలో అయినా పెరిగింది మద్రాసులో. మద్రాసులో చదువు పూర్తిచేసిన మీరు సినిమాల్లోకి రావడం తమాషాగా జఱిగింది. జగపతి బాబు గారు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తల్లి సినిమాల్లోకి వెళ్ళని తన చేతి ఒట్టు వేయించుకున్నదట. చదువు తర్వాత విశాఖపట్నంలో సొంత బిజినెస్ చూసుకునేవారు అట. ఆ సమయంలో సినిమా లోకి రావాలని నిర్ణయించుకున్నారు. కో డైరెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న వి.బి.రాజేంద్ర ప్రసాద్ గారు తన కుమారుని మాట మన్నించి 1989 లో తన సొంత బ్యానర్ లో సింహ స్వప్నం అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమా విజయవంతం కాలేదు. తొలి సినిమాతోనే డబుల్ రోల్ చేసిన మొదటి నటుడు జగపతి బాబు గారు. ఆ తరువాత కూడా చాలా చిత్రాలు ప్లాపుల గా నిలిచాయి. పట్టుదలతో జగపతి బాబు గారు ప్రయత్నించి చివరికి జగన్నాటకం, పెద్దరికం వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపును సాధించారు.ఇప్పటివరకు జగపతి బాబు గారి వాయిస్ బాగోలేదని వీరి సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం విశేషం. తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసిన గాయం సినిమా హిట్ కావడంతో హీరో గా స్థిరపడ్డారు. గాయం సినిమాకు తానే డబ్బింగ్ చెప్పి తన వాయిస్ బాగుందని ప్రజలతో మెప్పు పొందారు. 1994లో ఎస్ వి కృష్ణారెడ్డి గారి శుభలగ్నం సినిమా తో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక్కడి నుండి వీరు దాదాపు 80 చిత్రాలకు పైగా చేశారు. వీరు మహిళా ప్రేక్షకులను ఎక్కువగా సంపాదించుకున్నారు. కృష్ణవంశీ అంతఃపురం సినిమా లో సారాయి వీర్రాజు గా మంచి పేరు సంపాదించుకున్నారు. 25 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా జగపతి బాబు గారు హీరోగా ఇకనుండి చేయనని చెప్పి నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం లెజెండ్ ప్రతినాయకుని పాత్రలు నటించారు. ఇక్కడ నుండి అనేక చిత్రాలకు విలన్ వేషాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
*పురస్కారాలు*
శ్రీకారం చిత్రం ద్వారా ఉత్తమ నటుడు స్పెషల్ జ్యూరీ, అడవిలో అభిమన్యుడు చిత్రం ద్వారా ఉత్తమ నటుడు, గాయం చిత్రం ద్వారా ఉత్తమ నటుడు, మావిచిగురు చిత్రం ద్వారా ఉత్తమ నటుడు, అంతఃపురం సినిమా ద్వారా ఉత్తమ సహాయనటుడు, మనోహరం చిత్రం ద్వారా ఉత్తమ నటుడు, లక్ష్యం చిత్రం ద్వారా ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారాలు పొందారు.
*చిత్రాలు*
దొంగాట,అడవిలో అభిమన్యుడు,గాయం, శుభలగ్నం,శుభాకాంక్షలు, ఆయనకు ఇద్దరు,అంతఃపురం, మనోహరం,శివరామరాజు, హనుమాన్ జంక్షన్,లెజెండ్ ముఖ్యమైనదివి.
ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న హరిబాబు గారు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకునే ఆరోగ్యం,ఆయుష్యు ఆ భగవంతుడు దయ చేయాలని కోరుకుంటూ మణుగూరు తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు

*గొల్లపూడి మారుతీరావు* (ఏప్రిల్ 14, 1939 - డిసెంబరు 12, 2019) రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్...
12/12/2019

*గొల్లపూడి మారుతీరావు*

(ఏప్రిల్ 14, 1939 - డిసెంబరు 12, 2019) రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

*బాల్యం, విద్యాభ్యాసం*

గొల్లపూడి మారుతీ రావు 1939 ఏప్రిల్ 14 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (పూర్వపు మద్రాసు ప్రావిన్సు ), విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వారు జీవితాంతం విశాఖపట్టణం లోనే నివాసమున్నారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయము లలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రములో బి.యస్‌సీ (ఆనర్స్) చేశాడు. ఈయన అన్నపూర్ణ, సుబ్బారావుకి అయిదో కొడుకు.

*ఉద్యోగం*

మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశాడు. తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికై, హైదరాబాదుకు మారాడు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశాడు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది, సంబల్‌పూర్ వెళ్లాడు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందాడు. మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశాడు. తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశం చేశాడు.

*రచనా ప్రస్థానం*

మారుతీరావు రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడు లో 1954, డిసెంబరు 9న వెలువడింది. చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవాడు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు (గోగోల్ రాసిన An Inspector Calls ఆధారంగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి చేసిన రచన) నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతోపాటు, ప్రధానపాత్రధారిగా నటించాడు.

విద్యార్థి దశలో ఉండగానే శ్రీవాత్సవ రచించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించాడు. మనస్తత్వాలు నాటకాన్ని ఐదవ అంతర విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో భాగంగా కొత్తఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించాడు. ఆయన రచన అనంతం, ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి సమాచార, ప్రసార శాఖామాత్యుడు డాక్టర్ బి.వి.కేశ్‌కర్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకొన్నాడు. మనస్తత్వాలు నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్, కొత్తఢిల్లీ వారికోసం ప్రదర్శించాడు. ఆ అసోసియేషనుకు వి.వి.గిరి అధ్యక్షుడు. చైనా ఆక్రమణ పై తెలుగులో మొట్టమొదటి నాటకం రచించి, చిత్తూరు, మదనపల్లె, నగరి లలో ప్రదర్శించగా వచ్చిన సుమారు యాభై వేల రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చాడు.

చైనా విప్లవం పై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం వందే మాతరంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి పి.వి. నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశాడు. 1959, డిసెంబరు 16న రాగరాగిణి అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించబడింది. పథర్ కే అన్సూ అనే పేరుతో హిందీలోకి కూడా అనువదించబడింది.

*రచనలపై పరిశోధన*

ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్, మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించాడు. తెలుగు సాహిత్యం మీద ఆయన వ్రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.

*కుటుంబం*

మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న, విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. సి.నారాయణ రెడ్డి, కాళోజి నారాయణ రావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. ప్రముఖ రచయిత, విమర్శకుడు డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి, మనోధర్మ సంగీతం బాణీ ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు. మారుతీరావుకు ముగ్గురు మగసంతానం సుబ్బారావు, రామకృష్ణ మరియు శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన కుటుంబంతో మద్రాసులో నివసిస్తున్నాడు.

*గొల్లపూడి శ్రీనివాస్ స్మారక పురస్కారం*

1992 ఆగస్టు 12న మారుతీరావు చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్, తన తొలి ప్రయత్నంగా ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో జల ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించాడు. మారుతీరావు, తన కుమారుని జ్ఞాపకంగా, గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి, ప్రతి యేటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదుబహుమతి, ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రధానం చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ఏదేని అంశంపై విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవసూచకంగా రూ.15, 000 గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ లెక్చర్ పేరిట బహూకరిస్తారు. సునీల్ దత్, నసీరుద్దీన్ షా, మృణాల్ సేన్, శ్యాం బెనగల్, జావెద్ అక్తర్, అనుపమ్ ఖేర్ మొదలైన వారు ఇందులో ప్రసంగించిన వారిలో ప్రముఖులు. మిగిలిన ఇద్దరు కుమారులు సుబ్బారావు, రామకృష్ణలు మారుతీ ఎయిర్‌లింక్స్ అనే ట్రావెల్ ఏజన్సీని నడుపుతున్నారు.

*సినిమా ప్రస్థానం*

1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశాడు. మారుతీరావుకు అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఘనవిజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే, సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించాడు. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369 ఆయన నటించిన కొన్ని సినిమాలు. పూర్తి జాబితా కోసం ఆధికారిక వెబ్‌సైటును సందర్శించండి.

*అవార్డులు*

మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నాడు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

*నంది అవార్డులు*

1963 లో డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా
1965 లో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా
1989 లో కళ్ళు అనే రచన సినిమాగా వచ్చింది. దానికి ఉత్తమ రచయితగా
1991 లో మాస్టారి కాపురం సినిమాకి గాను ఉత్తమ సంభాషణల రచయితగా
ఇతర పురస్కారాలు సవరించు
2002లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ విశిష్ట పురస్కారం దక్కించుకున్నాడు.
1975లో కళ్ళు అనే నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం. ఈ నాటకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఆదాన్ ప్రదాన్ కార్యక్రమం కింద అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇదే నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు సాహిత్యం వారికి పాఠ్యపుస్తకంగా ప్రతిపాదించారు.
ఉత్తమ హాస్యరచనకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి సర్వరాయ మెమోరియల్ బంగారు పతకం
2002 లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పైడి లక్ష్మయ్య ధర్మనిధి పురస్కారం
1985లో వంశీ ఆర్ట్ థియేటర్స్ నుంచి ఉత్తమ నాటక రచనకు గాను గురజాడ అప్పారావు మెమోరియల్ బంగారు పతకం
1959 లో ఆకాశవాణి నిర్వహించిన, ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ రేడియో నాటక రచన పోటీల్లో ఉత్తమ రచనకు గాను బహుమతి
ప్రశ్న అనే నాటకానికి అఖిల భారత స్థాయిలో మహాత్మా గాంధీ సృజనాత్మక సాహిత్య పురస్కారం
1984లో ఉత్తమ నాటక రచనకు గాను వంశీ బర్కిలీ పురస్కారం
1983 లో తరంగిణి సినిమాలో ఉత్తమ హాస్యనటుడి పురస్కారం
1985లో రామాయణంలో భాగవతం సినిమాకు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా ఉత్తమ సహాయనటుడి పురస్కారం
1987లో సంసారం ఒక చదరంగం సినిమాలో ఉత్తమ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎంపిక.
2015లో లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం[2]
ఇవే కాక 2009 లో గుంటూరుకు చెందిన సాహితీ సమాఖ్య, అలనాటి ప్రముఖ రచయిత కొండముది శ్రీరామచంద్రమూర్తి పేరు మీదుగా నెలకొల్పిన అవార్డును, మారుతీరావుకు ప్రదానం చేశారు. అదే సంవత్సరంలో పొలమూరుకు చెందిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి నుంచి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారాన్ని అందుకున్నాడు.

2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.

*బుల్లితెరపై*

ఈటీవీ నిర్వహిస్తున్న ప్రతిధ్వని కార్యక్రమానికి మొదట్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ కార్యక్రమంలో ఆయన అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు. ఈటీవీ నిర్వహించిన మనసున మనసై అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. ఇది భార్యాభర్తల కోసం ఉద్దేశించింది. జెమిని టీవీ నిర్వహించిన ప్రజావేదిక, మాటీవీ నిర్వహించిన వేదిక, దూరదర్శన్, హైదరాబాద్ ప్రసారం చేసిన సినీ సౌరభాలు మొదలైనవి ఆయన నిర్వహించిన ప్రజాదరణ పొందిన కార్యక్రమాలు. ఇంకా ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు-పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రుః, ఏది నిజం? అనే ధారావాహికల్లో నటించాడు.

*సన్మానాలు*

1994 లో బెంగుళూరుకు చెందిన మేలు కలయిక
1996లో విజయనగరానికి చెందిన విజయ భావన
2004 లో ప్రవాసాంధ్ర నవ్యకళా పరిషత్, ఖరగ్‌పూర్ వారి నుంచి సన్మానం
2005లో విపంచి తెలుగు అసోసియేషన్, షార్జా వారి సన్మానం
2005లో రసమయి, దుబాయ్ వారిచే సన్మానం

*పదవులు*

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ నిర్వహించిన అనేక పోటీల్లో జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరించాడు. జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలన విభాగంలో పనిచేశాడు. 1958లో జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున మనస్తత్వాలు అనే నాటకాన్ని ప్రదర్శించాడు. 1978లో మద్రాసులో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆకాశవాణి తరపున సమీక్షకుడిగా వ్యవహరించాడు. 1996 లో జరిగిన ఇండియన్ పనోరమాలో జ్యూరీ సభ్యుడిగా వ్యవహరించాడు. 2000, డిసెంబరు 8 న జరిగిన ప్రపంచ తెలుగు సమావేశంలో కళలు, సంస్కృతి మీద సెమినార్ కు అధ్యక్షత వహించాడు. 2007, జూన్ 2, 3 తేదీల్లో చెన్నైలో జరిగిన అఖిల భారత తెలుగు సమావేశంలో కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు. 2007, సెప్టెంబరు 23 న కృష్ణా జిల్లాలో జరిగిన తెలుగు రచయితల సమావేశంలో కీలకోపన్యాసకుడుగా వ్యవహరించాడు.

*మరణం*

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మారుతిరావు చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, డిసెంబరు 12న మరణించారు

శేఖర్ కమ్ముల కొత్త సినిమా రెడీ నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రాన...
03/11/2019

శేఖర్ కమ్ముల కొత్త సినిమా రెడీ
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రానికి టైటిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ శేఖర్ కమ్ముల సినిమాలకు ఇంగ్లీష్‌లోనే టైటిల్స్ పెట్టారు. ప్రస్తుతం నాగ చైతన్య సినిమాకు కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగించనున్నారు. ‘లవ్ స్టోరీ ’ అనే టైటిల్‌ను శేఖర్ పరిశీలించారట. దీనినే ఫైనల్ చేస్తారని సమాచారం. పూర్తి స్థాయి ప్రేమకథతోనే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఈ మూవీలో నాగ చైతన్య తెలంగాణ యువకుడిగా కనిపించనున్నారట. ఫిదా బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మూవీని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నందమూరి వారసుడు ఎంట్రీ పిక్స్ నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో మోక్షజ్ఞ, ...
03/11/2019

నందమూరి వారసుడు ఎంట్రీ పిక్స్

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో మోక్షజ్ఞ, అదిగో మోక్షజ్ఞ అంటూ ఫ్యాన్స్‌ని ఊరిస్తూనే ఉన్నారు. బాలయ్య నూరో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇంకో సినిమా కోసం కూడా అదే ప్రచారం కంటిన్యూ అయ్యింది. బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ, మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం షురూ కావడం లేదు. అసలింతకీ మోక్షజ్ఞకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? లేదా? అనే ఆలోచనకి అభిమానులు వచ్చేశారు.

అసలు మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదనీ, కావాలని బలవంతం చేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపించాయి. మరి ఈ గుసగుసలకు చెక్‌ పెట్టాలన్నీ, రూమర్స్‌కి సడెన్‌ బ్రేక్‌ ఇవ్వాలన్నా ఒక్కటే మార్గం, మోక్షజ్ఞ ఎంట్రీ షురూ కావడమే. కానీ ఎప్పుడు.? అందుకు సమయమొచ్చిందంటున్నారిప్పుడు. బాలయ్య ప్రస్తుతం కె.ఎస్‌.రామారావు దర్శకత్వంలో 'రూలర్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుతో ఓ సినిమాలో నటించనున్నాడు.



credit: third party image reference

ఆ సినిమాతో పక్కాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని లేటెస్ట్‌గా అందుతోన్న సమాచారం. ఇదో పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ మూవీ అని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శీను ఈ స్క్రిప్టుపై వర్క్‌ చేస్తున్నాడట. 'వీవీఆర్‌' తర్వాత బోయపాటి నుండి రానున్న సినిమా ఇది. రేపో మాపో సెట్స్‌ మీదికి వెళ్లనుంది. చూడాలి మరి, ఈ సారైనా నందమూరి వారసుడి ఎంట్రీ ఉంటుందో.? లేక ఎప్పటిలానే ఊరించి ఉసూరుమనిపిస్తారో.!

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం తీయబోతున్నారా పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి వస్తున్నాడనే వార్తలు కొంతకాలంగా జరుగుతున్నాయి. ...
03/11/2019

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం తీయబోతున్నారా
పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి వస్తున్నాడనే వార్తలు కొంతకాలంగా జరుగుతున్నాయి. అతను అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ వార్తను రామ్ చరణ్ ధృవీకరించారు మరియు ఇది ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పునరాగమన చిత్రానికి త్రివిక్రమ్, క్రిష్ వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి

credit: third party image reference



credit: third party image reference

టిన్సెల్ పట్టణం నుండి వచ్చిన తాజా నివేదిక ఏమిటంటే, పవన్ తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రీ-ఎంట్రీ కోసం తన సాల్వ్డ్ ప్రాజెక్ట్ 'సత్యాగ్రహి'ని పరిశీలిస్తున్నాడు. 'సత్యాగ్రహి' అనేది పవన్ అభిమానులలో తెలిసిన పేరు. ఈ చిత్రం 2006 లో ప్రారంభమైంది, కాని తెలియని సమస్యల కారణంగా కొద్ది రోజుల్లోనే ఆగిపోయింది. ఈ చిత్రం యొక్క భావన ఇతర సాధారణ వాణిజ్య చిత్రాలకు భిన్నంగా సామాజిక సమస్యలపై ఆధారపడి ఉంటుంది.కాబట్టి, ప్రస్తుత దృశ్యానికి సరిపోయేలా స్క్రిప్ట్‌కు కొన్ని రీటచ్లు ఇవ్వాలని, మూలాల ప్రకారం ఈ చిత్రాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని పవన్ యోచిస్తున్నాడు. ఈ చిత్రం పవన్‌కు చాలా దగ్గరగా ఉంది మరియు అతను తన భావజాలాన్ని మరియు దాని ద్వారా ఆలోచించే విధానాన్ని కూడా ప్రేరేపించగలడు. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే, అతను ఈ విషయాన్ని పునరుద్ధరించాలని మరియు క్రిష్‌ను బోర్డులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు.

'గమ్యం', 'వేదం', 'కృష్ణమ్ వందే జగద్గురం' మరియు 'కాంచె' వంటి వాస్తవిక మరియు సామాజికంగా సంబంధిత చిత్రాలకు క్రిష్ పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి, ఎ.ఎం.రత్నం నిర్మించే ఈ ప్రాజెక్టును నిర్వహించడానికి తాను ఉత్తమమని పవన్ భావించినట్లు తెలిసింది. ఇవన్నీ ఇప్పటికి పుకార్లు మాత్రమే అయినప్పటికీ, అవి నిజమో కాదో మనం చూడాలి.

మన లేడీ అమితాబ్ బచ్చన్ ఏంచేసిందో తెలిస్తే షాక్ లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతిని తమ చిత్రాలలో సహాయక పాత్రల కోసం పలువురు స్...
03/11/2019

మన లేడీ అమితాబ్ బచ్చన్ ఏంచేసిందో తెలిస్తే షాక్

లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతిని తమ చిత్రాలలో సహాయక పాత్రల కోసం పలువురు స్టార్ డైరెక్టర్లు సంప్రదించారు. ఏదేమైనా, ఇటీవలి వరకు రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టి సారించిన నటి వారందరినీ తిరస్కరించింది. అంతేకాక, ఆమె తిరిగి వచ్చే చిత్రంలో కథానాయకుడి పాత్ర కూడా తన పాత్రగా ఉండాలని ఆమె కోరుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, గంధపు చెక్క సమ్మోహకుడు రష్మిక మండన్న ప్రధాన పాత్రల్లో నటించిన సరిలేరు నీకేవారు అనే ఆమె పున ప్రవేశ చిత్రం లో ఆమెకు మాంసం పాత్ర లభించిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఎన్ని రోజులు పనిచేస్తుందో ఈ చిత్రంలో ఆమె ఎంత కీలకమైన పాత్ర పోషిస్తోందో చెబుతుంది.



credit: third party image reference

ఇప్పటివరకు నేను 50 రోజులు పనిచేశాను మరియు నా పనిలో మిగిలిన భాగానికి 25 రోజులు కేటాయించాను. కాబట్టి, మొత్తం పనిదినాలు 75 రోజులు, ఇది నా పాత్ర హీరోతో సమానంగా ఉందని తెలుపుతుంది. నా పాత్ర అంత ముఖ్యమైనది కాకపోతే నేను ఎందుకు సినిమా చేస్తాను? ”అని విజయశాంతి ధృవీకరిస్తుంది.

ఈ చిత్రంలో కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో విజయశాంతి నటిస్తుందని, దీపావళి సందర్భంగా హీరోక్ ఇటీవల విడుదలైందని చెబుతున్నారు. అనిల్ రవిపుడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి విడుదలకు షెడ్యూల్ ఉంది.

Address

Kurnool
518002

Telephone

+919573376675

Website

Alerts

Be the first to know and let us send you an email when FILM News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to FILM News:

Share