A journey to ancient hindusthan

A journey to ancient hindusthan a journey to the ancient Hindusthan

కన్యాకుమారితమిళనాడు • భారతదేశం కన్యాకుమారి అక్షాంశరేఖాంశాలు: 8.078°N 77.541°Eకాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)విస్తీర్ణం• ...
05/10/2021

కన్యాకుమారి
తమిళనాడు • భారతదేశం

కన్యాకుమారి
అక్షాంశరేఖాంశాలు: 8.078°N 77.541°E
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
• ఎత్తు 25.89 కి.మీ² (10 sq mi)
• 0−300 మీ (−984 అడుగులు)
జిల్లా (లు) కన్యాకుమారి జిల్లా
జనాభా
• జనసాంద్రత 19,678 (2001 నాటికి)
• 665/కి.మీ² (1,722/చ.మై)
జిల్లా కలెక్టర్ దేవ్ రాజ్ దేవ్
కోడులు
• పిన్‌కోడ్
• ప్రాంతీయ ఫోన్ కోడ్
• వాహనం
• 629 ###
• +914652
• TN 74 & TN 75

కన్యాకుమారి pronunciation (సహాయం·సమాచారం) తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణం. ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశము లేదా అగ్రము (Cape) . దీనిని కన్యాకుమారి అగ్రము అనికూడా పిలుస్తారు (ఆంగ్లంలో Cape Comorin) . ఇది భారతదేశానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి జిల్లా. ఇది భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఇది పడమటి కనుమలలో ప్రకృతిసిద్ధమైన ప్రదేశం.

మూడు సముద్రాల అరుదైన మేలుకయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటా డు. ముఖ్యంగా పౌర్ణ మి రోజు రాత్రి పూ ట ఏకకాలంలో జ రిగే సూర్యా స్తమ యం, చంద్రో దయాలను చూ సి పులకించని యాత్రికుడుండడేమో.

త్రివేణి సంగమ క్షేత్రం… కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసముద్రం, దిగువన హిందూ మహాసముద్రం.. వీక్షకుల్ని పరవశింపజేస్తుం టాయి. సముద్రతీర ప్రకృతి రమణీ యతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణు వులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటా రు. అలాగే వారణాసి పరమశివు డికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు.

ప్రధాన ఆకర్షణలివే… Triveni_Sangamamకన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్‌, తిరువళ్లువర్‌ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమరి ఆలయం ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్‌, ఫ్లెమింగ్‌, స్పూన్‌బిల్‌, అనేక రకాల బాతులు.. కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

వివేకానంద రాక్‌… కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్‌. ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970వ సంవ త్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వ తిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూ పంలోని ఆమె పాద ముద్రిలు కూడా మనకు దర్శనమిస్తాయి.

తరువళ్లువర్‌ విగ్రహం… Kanya-Kumari-Ammanవివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్‌ కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరు వళ్లువర్‌ విగ్రహం బరువు ఏడువేల టన్నులు కాగా.. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే. ఇది ఆసియా లోని ఎతె్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది.

మహాత్ముని స్మారక చిహ్నం… కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి అయిన అక్టోబరు 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం.

కుమరి ఆలయం… Mahatma_Gandhi_Mandapamబాణాసురుడిని సంహరించిన అమ్మవారి కుమరి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మూడువైపులా ఎతె్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలు న్నాయి. ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. ఒకప్పుడు దేవి ముక్కెరలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాళ్లను ఢీకొనేవని చెబుతుంటారు. బంగాళాఖాతానికి అభి ముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారా న్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవ త్సరంలో ఓ నాలుగైదుసార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు.

ఆలయ చరిత్ర… పురాణ కథనాల ప్రకారం కుమరి ఆలయంలో దేవతగా కొలువబడుతున్న కన్యాదేవి, పరమశివుడిని వివాహం చేసు కునేందుకు సిద్ధపడిం దట. అయితే ముహూర్తం సమయా నికి కూడా శివుడు రాకపోవ టంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు.

ఇందిరాపాయింట్‌… కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరాపాయింట్‌ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలలనుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయ్‌ కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమి ళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్‌ పతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది.

రొయ్యలకూ ప్రసిద్ధి… ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి ‘రాక్‌ లాబ్‌స్టర్స్‌’ అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందినది. సగటున రెండు కేజీల బరువుండే ఈ లాబ్‌స్టర్ల ధర 5 వేల రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరి శోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్‌ కల్చర్‌ద్వారా ప్రత్యేకంగా పెంచ బడే ఈ లాబ్‌స్టర్లను ఎక్కువగా జపాన్‌, హాంకాంగ్‌ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.

Vivekananda_Rockకన్యాకుమారి, మండపం, కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఈ లాబ్‌స్టర్లు ఎక్కువగా దొరుకు తుంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టి వీటికి రాక్‌ లాబ్‌స్టర్స్‌ అనే పేరు వచ్చింది. ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్‌ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు-జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేం దుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తుంటారు.

ఇలా వెళ్లాలి… చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే.. విమాన మార్గంలో అయితే, మధురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలో మీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి

Think bigBe brave, do good
08/03/2021

Think big
Be brave, do good

Welcome to my page friends
27/01/2021

Welcome to my page friends

Address

Kadapa

Telephone

+917330905653

Website

Alerts

Be the first to know and let us send you an email when A journey to ancient hindusthan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to A journey to ancient hindusthan:

Share