Medagam Srujan Reddy

Medagam Srujan Reddy MUSIC ALWAYS MAKES EVERYONE FEEL SO RELATED TO EACH OTHER EVEN IF MILES AWAY... LANGUAGE IS NEVER A

రోజూ పడుకునే సమయానికి నిద్ర రాకపోతే నీ జ్ఞాపకాల వల్ల అనుకున్నానుకానీ, నిన్ను ఇంకొంచెం సేపు తలుచుకోడానికి మూతపడుతున్న కన్...
24/11/2021

రోజూ పడుకునే సమయానికి నిద్ర రాకపోతే నీ జ్ఞాపకాల వల్ల అనుకున్నాను
కానీ, నిన్ను ఇంకొంచెం సేపు తలుచుకోడానికి మూతపడుతున్న కన్నులకు కాసేపు ఆగమని మోర పెట్టుకుంటున్నానని తెలుసుకోలెకపోయా

Medagam Srujan Reddy

The You is Attraction..!ఆకర్షణలోని ప్రతీ అక్షరం నిన్ను చూసి ఆకర్షితమై అక్షువు ఆర్పక అదే పనిగా తిలకిస్తూ తన్మయమొందెనే అక్...
11/07/2021

The You is Attraction..!

ఆకర్షణలోని ప్రతీ అక్షరం నిన్ను చూసి ఆకర్షితమై అక్షువు ఆర్పక అదే పనిగా తిలకిస్తూ తన్మయమొందెనే అక్షర...



A beautiful rainy season...పూగొమ్మలు ముద్దుగుమ్మలయ్యేఅవని సుగంధమయ్యేచిలకరించగా మేఘములు చిరుజల్లులుఅంతటి అదృష్టం లేదనిఆకా...
21/06/2021

A beautiful rainy season...

పూగొమ్మలు ముద్దుగుమ్మలయ్యే
అవని సుగంధమయ్యే
చిలకరించగా మేఘములు చిరుజల్లులు
అంతటి అదృష్టం లేదని
ఆకాశం తెల్లబొయ్యే

Life is mysterious... It will not allow you to take anything...జీవితాసాంతం నీ సొంతమయ్యేదేది లేదుజీవితం సొంతం అవ్వగానే అన...
09/06/2021

Life is mysterious... It will not allow you to take anything...

జీవితాసాంతం నీ సొంతమయ్యేదేది లేదు
జీవితం సొంతం అవ్వగానే అన్ని వదిలేసి వెళ్లాల్సిందే
జ్ఞాపకాలతో సహా..!

Live life as it is, at last you'll be left with soil only...పొట్టలో పుట్టి మట్టిలో గిట్టే చిట్టి జన్మ నట్ట నడుమనరొట్టె క...
08/06/2021

Live life as it is, at last you'll be left with soil only...

పొట్టలో పుట్టి మట్టిలో గిట్టే చిట్టి జన్మ నట్ట నడుమన
రొట్టె కోసం, బట్ట కోసం, కట్టే కోసం, పొట్టి కోసం
ఎంత కట్టపడినా చిట్ట చివరన చుట్టుకునేది మట్టే ..!

07/06/2021

I have reborn every minute as a poet...

పద పవనము నా కలమున వీచిన క్షణము
కుడి రెప్పలు రెప రెప రెప లాడిన క్షణము
నడి నెత్తిన ఆలోచన కదిలిన క్షణము
ఎద చప్పుడు పరవశమై పలికిన క్షణము
మృదు ప్రాకృతి పులకరించి పురివిప్పిన క్షణము
స్త్రీ ఆకృతి కలహంసగ కొలువైన క్షణము
రవి రౌద్రపు వడగాడ్పులు విసిరిన క్షణము
జడి వానకు భువి గంధము వీచిన క్షణము
ఇరు కన్నులు కనుగంగతో తడిసిన క్షణము
చిగురాశాలు చిగురెత్తక చెదిరిన క్షణము
మధురామృత భావనలను మోసిన క్షణము
నీరారిన భూతల్లిని చూసిన క్షణము
పోరాగి పుడమి నెత్తుటి దారైనా క్షణము
నిప్పురవ్వ బడబాగ్నిగ చెలరేగిన క్షణము
సుశరీరం శవమై శోకించు క్షణము
పిండం ప్రాణమై ఏడ్పు లంకించు క్షణము

ఆ క్షణమే కవిగా ప్రతి ఒక క్షణము పునఃజన్మించినాను క్షణ క్షణము అక్షర కణమై

Be human... Spread peace, good and love...శాంతికి స్మశానంమంచికి మరో యుగంఅవసరం లేదుమనిషి మనిషిలా బ్రతికితే చాలు          ...
06/06/2021

Be human... Spread peace, good and love...

శాంతికి స్మశానం
మంచికి మరో యుగం
అవసరం లేదు
మనిషి మనిషిలా బ్రతికితే చాలు

సహృదయులు, గాన గంధర్వులు, శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని ఆయన జన్మదిన సందర్భంగా స్మరించుకోవడం మన అదృష్ట...
04/06/2021

సహృదయులు, గాన గంధర్వులు, శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని ఆయన జన్మదిన సందర్భంగా స్మరించుకోవడం మన అదృష్టం..!

అక్షరానికి ఏ భాగ్యం కలిగినదో,
నీ గళమున గంతులేసినవి
రాగలకు ఏ రాజసం వచ్చినదో,
నీ సంగతులలో తడిసి తడిసి
తాళాలకు తుళ్ళింతలు
కృతులకు కవ్వింతలు
పల్లవికి పులకరింతలు
చారణానికి చక్కిలిగింతలు
కలగలేదంటే అది అతిశయోక్తి
మీ చరణ పద్మములనైన స్పృశింపలేదు
నా పాట మీ నోటా పలికింప అదృష్టం లేదు
నేనెంతటి హీన నసీబు కలవాడినో ఏమో

Don't publish your struggle or success... Just go on...శోకానికి సాక్షం ఎందుకువిజయానికి వెలుగెందుకు
03/06/2021

Don't publish your struggle or success... Just go on...

శోకానికి సాక్షం ఎందుకు
విజయానికి వెలుగెందుకు

Nothing more than you...!!నల్లని రాత్రికి రంగులు పూస్తు, వెన్నెల చంద్రుడినే దాచేస్తు,నిన్నే చూస్తుంటా నేను ఇక పైన       ...
30/05/2021

Nothing more than you...!!

నల్లని రాత్రికి రంగులు పూస్తు, వెన్నెల చంద్రుడినే దాచేస్తు,
నిన్నే చూస్తుంటా నేను ఇక పైన

🔥

Keep your ass moving folks...మూడ్ వచ్చినప్పుడేముడ్డి కదిలిస్తానంటేమడ్డి మడ్డి అయ్యిద్ధి జీవితం..!                       ...
30/05/2021

Keep your ass moving folks...

మూడ్ వచ్చినప్పుడే
ముడ్డి కదిలిస్తానంటే
మడ్డి మడ్డి అయ్యిద్ధి జీవితం..!

Don't hate the sweat...స్వేదంతో శత్రుత్వం,మంచంతో మిత్రుత్వం,ఎదుగుదలకు హానికరం..!                                        ...
30/05/2021

Don't hate the sweat...

స్వేదంతో శత్రుత్వం,
మంచంతో మిత్రుత్వం,
ఎదుగుదలకు హానికరం..!

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Medagam Srujan Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Medagam Srujan Reddy:

Share