Ramesh Art's

Ramesh Art's We wish to refresh everyone with our creativity of art work, paintings and poetry. Subscribe for m

14/05/2023

I have reached 800 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

07/11/2022

మునుగోడు ఏలక్షను......

మునుగోడు ఏలక్షను ముగిసి
అప్పుడే మునపటి దాయే...
మూడు పార్టీలకు ముచ్చెమటలు పోయించే...
గాలి మూటల హామీలు నాయకులు
వదిలి పోయే....
గాసిప్పులతో ఎవరి డంకా వారే మ్రోగించే...
గడప గడపకు గడ్డం పట్టి ఓటు అడిగే...
నోట్లు చూపి వోటరుకు ఎర వేసే.. .
మధ్య బ్రోకరు తో మధ్యాన్ని చేర వేసే....
ర్యాలీలకు రమ్మంటూ రాచ మర్యాదలు చేసే....
పార్టీలు యెదురు పడి ఎగిరీ ఎగిరి తన్నుకొనే...
దున్నపోతుల కుమ్ములాటలో దూడలా జనం నలిగి పోయె...
రక్షణ సిబ్బందికి రక్షణ కరువాయె....
రాళ్ళ దాడికి వాళ్లు సయితం షికారాయే....
రొక్కం అందిన ఓటరు రెక్కలు కట్టుకుని
ఓటు వేసి పోయె.....
రొక్కం అందని ఓటరు అలిగి రచ్చ రచ్చ
చేసి పోయె.....
రికాము లేక రిపోర్టర్లు ఊరకలు పెట్టే....
టీ ఆర్ పీ లు పెరిగి టీవీ లకు సంబరాలు ఆయే...
ప్రచారానికి ముగింపు అని ఏలక్షను కమిషన్ చెప్పే...
ప్రజా నాయకులను ప్రతిఘటించమనీ ప్రకటనలు చేసే..
ఏలక్షను బూతు కాడ పోటేత్తిన జనాలు...
పొద్దుగుంకి నాక కూడా పోలేమన్న వైనాలు....
ఏలక్షను సిబ్బందికి యనలేని తిప్పలు...
ఎటు పోని, చెప్పలేని పలు పలు వ్యధలు....
ఈ వీ యం ల భద్రత కై కట్టు దిట్ట చర్యలు...
విధిగా నిలుచు న్న వివిధ రక్షణ బృందాలు...
ఎగ్జిట్ పోల్స్ అంటూ యెన్నో ఎగిరి పడ్డాయి...
వారనకునే వారినే యెంచి అగ్రగామి చేశాయి...
నాయకుల అంచనాలు తారుమారు చేశాయి...
వాళ్ల గుండెల్లో రైళ్లను పరుగెట్టించాయి....
ఓటు లెక్కింపు మొదలైంది...
ఓటరు గుండె సవ్వడి తెలిసింది...
లీడర్ కు పాదరసం మీట పైకి యెగిసింది....
ఫలితాల పట్టిక అంకెలు పరుగులు పెట్టింది..
ఫలితాల ప్రకటనలు ప్రకంపనలు లేపింది....
ఓటమీ పాలయితే కారణాలు వెతికింది...
గెలుపు పొందిన వాడిని అంబరమున చేర్చినది...

గాదె రమేష్.
07.11.2022.

ముద్ద నోట్లో పెట్టుకోము సెల్ చేతిలో వుంటే, ముహూర్తం ధాటుతారంటారా స్వామి?
07/02/2022

ముద్ద నోట్లో పెట్టుకోము సెల్ చేతిలో వుంటే, ముహూర్తం ధాటుతారంటారా స్వామి?

ఉల్లిగడ్డ శాస్త్రీ గారి ఉల్లి నిషేదం ఊరికే అన్నట్టు....
04/02/2022

ఉల్లిగడ్డ శాస్త్రీ గారి ఉల్లి నిషేదం ఊరికే అన్నట్టు....

ఏంటి తాత ! వాటికి బర్త్డే చేయకూడదా ?🤔
02/02/2022

ఏంటి తాత ! వాటికి బర్త్డే చేయకూడదా ?🤔

నిర్మలమ్మ మన ఆశల మూట తెచ్చిందహో...🤔
02/02/2022

నిర్మలమ్మ మన ఆశల మూట తెచ్చిందహో...🤔

కోవిడ్ ఇలా కూడా వాడుకోవచ్చ?🤔
01/02/2022

కోవిడ్ ఇలా కూడా వాడుకోవచ్చ?🤔

ఇక నెల రోజుల క్యాంప్ అయితే నీ గతి ఏంటి అంకుల్?😀
31/01/2022

ఇక నెల రోజుల క్యాంప్ అయితే నీ గతి ఏంటి అంకుల్?😀

సమయ సందర్భము చూడని ప్రభుద్దులు  సమాజానికే ప్రమాదం...
30/01/2022

సమయ సందర్భము చూడని ప్రభుద్దులు సమాజానికే ప్రమాదం...

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramesh Art's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share