Chithraseema

Chithraseema Chitraseema literally means TINSEL TOWN.
(2)

CHITRASEEMA has most unique and exclusive content collection from various content vendors and some exclusive copyrighted materials Chitraseema is a audio video production house including films webseries shorts animations vfx and a complete suit of production and post production for entertainment media

*"పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్*'విరూపాక్ష' ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు...
19/08/2026

*"పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్*

'విరూపాక్ష' ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న సినిమా "పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్". ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సప్తగిరి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని క్యాండిడ్ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ప్రొడ్యూసర్ వివేకానంద్ వర్మ నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని దర్శకుడు సి.హెచ్. రవికిషోర్ రూపొందిస్తున్నారు. ఈ రోజు "పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.

"పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్" సినిమా మోషన్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే - పనసపల్లి ఊరు సినీ ప్రియులకు ప్రసిద్ధి. అక్కడ గోడలపై కొత్త సినిమాల పోస్టర్స్ పడాల్సిందే. హీరో పనసపల్లి మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్ సంఘానికి అధ్యక్షుడు, బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ హీరోయిన్. తమ హీరోల సినిమాలు సాధించే బాక్సాఫీస్ రికార్డులపై హీరో హీరోయిన్ పోటా పోటీలు పడటం మోషన్ పోస్టర్ లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఫ్యాన్ వార్ ఎక్కడి దాకా వెళ్లింది, ఎలాంటి మలుపులు తిరిగింది, ఎలా వినోదాన్ని పంచింది అనేది సినిమాలో చూడాలి.

"పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్" సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు - వివేక్ దండు, సంగీర్తన విపిన్, సప్తగిరి, రాజా రవీందర్, బాబు మోహన్, వంశీధర్ గౌడ్, షైనింగ్ ఫణి, జబర్దస్త్ అశోక్, జబర్దస్త్ అప్పారావు, తదితరులు

టెక్నీషియన్స్
------------------------
ఎడిటర్ - నరేష్ అడుపా
డీవోపీ - మోహన్ చారి
మ్యూజిక్ డైరెక్టర్ - ఎంఎల్ రాజా
బ్యానర్ - కాండిడ్ ఫిలింస్
ప్రొడ్యూసర్ - పి.వివేకానంద్ వర్మ
స్క్రిప్ట్, డైరెక్టర్ - సి.హెచ్. రవికిషోర్
పీఆర్ఓ - సురేష్ ( ఎస్ కె మీడియా )

Ram Pothineni Goes All Out for RaPo23; Pulls Off a 24-Hour Shoot! Energetic Star Ram Pothineni seems to be leaving no st...
19/08/2026

Ram Pothineni Goes All Out for RaPo23; Pulls Off a 24-Hour Shoot!

Energetic Star Ram Pothineni seems to be leaving no stone unturned for his ambitious directorial debut, RaPo23. According to sources, Ram recently pulled off an intense 24-hour shooting stretch on the outskirts of Pondicherry for the film. What makes it even more demanding is that Ram is not just calling the shots as the director but is also playing the lead role in the film.

A massive setup was mounted in Pondicherry for the schedule, which continued for nearly nine days. Sources suggest that Ram has been pushing himself vigorously as an actor while simultaneously overseeing every aspect of the film as its director. The scale at which RaPo23 is being mounted is also said to be one of the major talking points within the team.

However, unexpected rains disrupted the Pondicherry schedule, forcing the unit to temporarily halt filming and return to Hyderabad. The team is expected to head back to Pondicherry soon to complete the remaining portions on the same massive setup.

With Ram taking on the dual responsibility of actor and director and putting himself through such demanding schedules, RaPo23 appears to be shaping up as one of his most ambitious projects yet.

Produced by Krishna Pothineni under Rapo Cinematics, the film is being planned on a large scale. RaPo23 is shaping up as a distinctive psychological action thriller, with the narrative unfolding against a dark and intriguing neo-noir backdrop.

The film is backed by a strong technical crew. National Award-winning cinematographer Thirunavukarasu (Thirru) is behind the camera, promising striking and atmospheric visuals. The action department features the combined expertise of Vikram Mor and acclaimed stunt choreographer Peter Hein, while production designer AS Prakash is crafting elaborate sets to complement the film’s expansive scale and distinctive visual world.

More updates regarding its cast, characters and upcoming schedules are expected in the coming months.

Cast: Ram Pothineni

Technical Crew:
Writer, Director: Ram Pothineni
Producer: Krishna Pothineni
Banner: Rapo Cinematics
DOP: Thirunavukarasu
Music: Sam Cs
Stunts: Peter Hein, Vikram Mor
Production Designer: AS Prakash
PRO: Vamsi-Shekar

‘RaPo23’ కోసం 24 గంటలు పాటు ఏకధాటిగా షూట్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడి...
19/08/2026

‘RaPo23’ కోసం 24 గంటలు పాటు ఏకధాటిగా షూట్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘RaPo23’ కోసం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవల పుదుచ్చేరి శివార్లలో రామ్ ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా షూట్ చేశారు. విశేషం ఏమిటంటే రామ్ కేవలం డైరెక్టర్‌గా కెమెరా వెనుక ఉండటమే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నారు.

పుదుచ్చేరిలో ఈ సినిమా కోసం భారీ సెటప్ వేశారు. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌లో రామ్ నటుడిగా తనపై ఉన్న బాధ్యతతో పాటు, దర్శకుడిగా సినిమా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘RaPo23’ ప్రస్తుతం అందరిలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అనూహ్యంగా కురిసిన వర్షాల కారణంగా పుదుచ్చేరి షెడ్యూల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడటంతో యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. మిగిలిన షూటింగ్‌ను అదే భారీ సెటప్‌లో పూర్తి చేసేందుకు త్వరలోనే టీమ్ మళ్లీ పుదుచ్చేరి వెళ్లనుంది.

హీరోగా, దర్శకుడిగా ఒకేసారి రెండు బాధ్యతలు తీసుకున్న రామ్.. ఇంత కఠినమైన షూటింగ్ షెడ్యూల్స్‌లోనూ డెడికేషన్ తో పని చేస్తున్న తీరు ‘RaPo23’పై ఆసక్తిని మరింత పెంచుతోంది. కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. డార్క్, ఇంట్రెస్టింగ్ నియో-నోయిర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు (తిర్రు) కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్ పార్ట్‌ను విక్రమ్ మోర్, పీటర్ హెయిన్ కలిసి హ్యాండిల్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ సినిమా కథకు, భారీ స్కేల్‌కు తగ్గట్టుగా ప్రత్యేకమైన సెట్స్‌ను రూపొందిస్తున్నారు. సినిమా కాస్ట్, క్యారెక్టర్స్, తదుపరి షెడ్యూల్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ రాబోయే రోజుల్లో వెల్లడించనున్నారు.

తారాగణం: రామ్ పోతినేని

రచన, దర్శకత్వం: రామ్ పోతినేని
నిర్మాత: కృష్ణ పోతినేని
బ్యానర్: రాపో సినిమాటిక్స్
డీవోపీ: తిరునవుక్కరసు
మ్యూజిక్: సామ్ సీఎస్
స్టంట్స్: పీటర్ హెయిన్, విక్రమ్ మోర్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
PRO: వంశీ-శేఖర్

అనీష్, అనస్వర రాజన్, మోహిత్ చౌహాన్, ఎస్. థమన్ 'ఇట్లు అర్జున' నుంచి లవ్ బ్యాంగర్‌ చిన్ని చిన్ని సాంగ్ రిలీజ్స్టార్ డైరెక్...
19/08/2026

అనీష్, అనస్వర రాజన్, మోహిత్ చౌహాన్, ఎస్. థమన్ 'ఇట్లు అర్జున' నుంచి లవ్ బ్యాంగర్‌ చిన్ని చిన్ని సాంగ్ రిలీజ్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ఆసక్తి పెంచుకున్న ఈ సినిమా నుంచి తాజాగా రెండో సింగిల్ ‘చిన్ని చిన్ని’ను మేకర్స్ విడుదల చేశారు.

ఎస్. థమన్ కంపోజ్ చేసి, ప్రోగ్రామ్ చేసి, అరేంజ్ చేసిన ఈ పాట ఫ్రెష్, మెలోడీయస్ రొమాంటిక్ నంబర్‌గా ఆకట్టుకుంటోంది. అకౌస్టిక్ సౌండ్స్‌కు ఎనర్జిటిక్ ఎలక్ట్రానిక్ బీట్స్‌ను జోడించిన థమన్.. ఎలక్ట్రిక్ మాండలిన్, రిథమ్ గిటార్స్, సాఫ్ట్ సింథ్స్‌తో పాటకు మంచి రిచ్ సౌండ్ తీసుకొచ్చారు.

మోహిత్ చౌహాన్ తన సిగ్నేచర్ వాయిస్‌తో పాటకు నాస్టాల్జిక్ ఫీల్ తీసుకొచ్చారు. కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ ప్రేమలో పడినప్పుడు కలిగే ఆ చిన్న చిన్న ఆనందాలు, రోజువారీ క్షణాల్లో పుట్టే ప్రేమను అందంగా చెబుతున్నాయి. ‘చిన్ని చిన్ని నా పాటే’ అనే హుక్ లైన్ పాటకు మరింత క్యాచీ ఫీల్ ఇచ్చింది.

స్కూటర్‌పై పచ్చని లొకేషన్లలో, సిటీ స్ట్రీట్స్‌లో కలిసి తిరగడం నుంచి.. రూఫ్‌టాప్‌పై ప్రశాంతంగా గడిపే క్షణాలు, రద్దీగా ఉన్న మెట్రోలో ఒకరికొకరు దొంగచూపులు చూసుకోవడం, చివరికి థియేటర్‌లో తమ ప్రేమకథను చూసుకోవడం వరకు.. అనీష్, అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా, నేచురల్‌గా అనిపిస్తోంది.

యూత్‌ఫుల్ విజువల్స్, మోహిత్ చౌహాన్ వాయిస్, థమన్ మెలోడీ, హీరోహీరోయిన్ల మధ్య ఉన్న స్పార్కింగ్ కెమిస్ట్రీ కలిసి ‘చిన్ని చిన్ని’ పాటను వెంటనే ఆకట్టుకునే రొమాంటిక్ నంబర్‌గా నిలబెట్టాయి.

విడుదలైన వెంటనే పాటకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

Witness A Love Banger- Electrifying Breezy Number Chinni Chinni From Itlu Arjuna- Composed By S Thaman, Sung By Mohit Ch...
19/08/2026

Witness A Love Banger- Electrifying Breezy Number Chinni Chinni From Itlu Arjuna- Composed By S Thaman, Sung By Mohit Chauhan, Starring Aniesh & Anaswara Rajan Unveiled

Star director Venky Kudumula is stepping into production with Itlu Arjuna under What Next Entertainments, introducing Aniesh as the film’s lead hero. Directed by debutant Mahesh Uppala and starring Anaswara Rajan as the female lead, the film has already generated enough curiosity through its title glimpse, first single, promotional material, and the intriguing Finding Arjuna promo. Now, the makers have come up with the second single, Chinni Chinni- A Love Banger.

Composed, programmed, and arranged by S Thaman, Chinni Chinni is a breezy and melodious romantic song with an upbeat contemporary feel. It blends acoustic sounds with energetic electronic beats. The electric mandolin adds a catchy folk-pop touch, while rhythm guitars and soft synths give the song a rich and vibrant sound.

Sung with soulful, breezy charm by Mohit Chauhan, the song benefits immensely from his signature textured voice, which infuses warmth and nostalgic longing into the track. Written by Kalyan Chakravarthy, the lyrics revolve around blossoming love, sweet everyday moments, and the overwhelming feeling of a small world turning into an infinite universe when you fall for someone. The catchy hook line, Chinni Chinni Naa Paatey, captures the playful and heartwarming rhythm of falling in love.

From riding together on a scooter through lush greenery and city streets to sharing quiet rooftop moments, stealing glances on a crowded metro, and watching their story unfold in a movie theatre, Aniesh and Anaswara’s interplay feels fresh, youthful, and deeply endearing. The duo indeed shares effortless and sparkling chemistry.

The song receives an instantaneously blockbuster response and is poised to become a chartbuster romantic number.

MALVIKA SHARMA LATEST PHOTO SHOOT IMAGES
19/08/2026

MALVIKA SHARMA LATEST PHOTO SHOOT IMAGES

నిధి అగర్వాల్, వరాహ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.1 క్రేజీ మైథాలజీ థ్రిల్లర్ గ్రాండ్ గా లాంచ్నిధి అగర్వాల్ హీరోయిన్ గా వరాహ్ ...
19/08/2026

నిధి అగర్వాల్, వరాహ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.1 క్రేజీ మైథాలజీ థ్రిల్లర్ గ్రాండ్ గా లాంచ్

నిధి అగర్వాల్ హీరోయిన్ గా వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

మైథాలజీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న చిత్రానికి సునీత్ పడోల్కర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీ. అశోక్, పీ. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మత్ సర్నా క్లాప్ ఇచ్చారు. హీరోయిన్ నిధి అగర్వాల్ తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. పోస్టర్‌లో నిధి అగర్వాల్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఇప్పటివరకు ఆమె కనిపించని కొత్త అవతార్‌ను పరిచయం చేసేలా ఉంది.

హీరోయిన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దర్శకుడు పవర్ఫుల్ కథ ని సిద్ధం చేశారు.

ఈ సినిమా టైటిల్‌తో పాటు మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

హీరోయిన్: నిధి అగర్వాల్

దర్శకుడు: శ్రీనివాస్ గోపిశెట్టి
నిర్మాత: సునీత్ పడోల్కర్
బ్యానర్: వరాహ్ ఫిల్మ్స్
పిఆర్వో : వంశీ శేఖర్

19/08/2026

CHIRANJEEVI NEW TELUGU MOVIE MUSIC RECORDING SESSION AND CHITRA GARU BYTE ABOUT THE MOVIE

19/08/2026

ITRLU ARJUNA PRE-RELEASE PROMO

Address

B-41/a 2nd Floor Sai Shikara Madhura Nagar
Hyderabad
500038

Alerts

Be the first to know and let us send you an email when Chithraseema posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Chithraseema:

Shortcuts

Share