India Tech Star

India Tech Star Dear Friend's,

This is Roshni Roy Istarted this page for Technology news , Application revi

01/10/2023
Please share
09/08/2021

Please share

20/12/2020

Please don't encourage like this activities🙏🙏🙏🙏

Advanced happy friendship day 🎉🎉🌹🥳🌼🎈Friends
30/07/2020

Advanced happy friendship day 🎉🎉🌹🥳🌼🎈
Friends

Silence is more.........
15/03/2020

Silence is more.........

29/02/2020
28/02/2020

*జాతీయ సైన్స్ దినోత్సవంగా ఫిబ్రవరి 28 న ఎందుకు జరుపుకుంటాం?*

👉🏻ప్రముఖ భౌతికశాస్త్ర పరిశోధకుడు, నోబెల్ బహుమతి గ్రహీత *సీవీ రామన్* ఈ రోజునే *రామన్ ఎఫెక్ట్‌ను* కనుగొన్నారు.

👉🏻సీవీ రామన్‌గా పేరుగాంచిన ప్రముఖ భౌతికశాస్త్ర పరిశోధకుడు చంద్రశేఖర్ వెంకటరామన్ 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్‌ కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. భౌతికశాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా ఆ తేదిని జాతీయసైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. *1888 నవంబరు 7 న* తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు రామన్ జన్మించారు.

👉🏻విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన రామన్ చిన్ననాటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై అమితాసక్తిని ప్రదర్శించేవారు. తండ్రి కూడా భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో దానిపై మరింత కుతూహలం పెంచుకున్నారు. తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించాడు. ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఆ సబ్జెక్టులో గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

👉🏻పద్దెనిమిదేళ్ల వయసులో కాంతికి సంబంధించిన ధర్మాలపై రామన్ రాసిన పరిశోధనా వ్యాసాలు లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధనల పట్ల అయనకున్న అభిరుచిని గమనించిన అధ్యాపకులు ఇంగ్లాండు వెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఆయన ఆరోగ్యం ఇంగ్లాండు వాతావరణానికి సరిపడదని తేల్చడంతో ప్రయాణాన్ని విరమించుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఫైనాన్స్ విభాగంలో చేరిన సీవీ రామన్ 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు.

👉🏻అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్లి పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. రామన్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని ఆ లేఖలో సూచించారు. అయితే బ్రిటీష్‌ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన రామన్ పరిశోధనలపై పూర్తిస్థాయి సమయాన్ని వెచ్చించాడు.

👉🏻ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఒకసారి కలకత్తాలో వీధుల్లో తిరుగుతుండగా బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూశాడు. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు.

👉🏻అతని తల్లి పార్వతి అమ్మాళ్‌ వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీత వాయిద్య పరికరాలపై సాగింది. విజ్ఞాన పరిశోధనలపై తృష్ణ‌తో ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ‌లో ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. *తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై 1921లో లండన్‌లో ఉపన్యాసాలు ఇచ్చాడు. శ్రోతల్లోని ఓ వ్యక్తి ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అంటు హేళన చేశాడు.*

👉🏻దీంతో రామన్‌కు పరిశోధనలపై మరింత పట్టుదల పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతివైపు మళ్లించాడు. ఇంగ్లాండు నుంచి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు *ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని* ఆసక్తితో గమనించాడు. *అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలం రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం కాదని.... సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించాడు.*

👉🏻కలకత్తా చేరుకోగానే తన ప్రాకల్పనలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 ఏడాదికి భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందిన కాంప్టన్ ఎక్స కిరణాలు పరిశోధననిజమైనపుడు, కాంతి విషయంలోనూ నిజం కావాలంటూ ఆలోచనలో పడ్డాడు.

👉🏻ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. అధునాతనమైన పరికరాలు లేకపోయినా తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్న రామన్ అనుకున్నట్లుగానే *1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్‌ను* కనుగొన్నాడు. *పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించాడు*. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెళ్లడించాడు.

👉🏻దీంతో బ్రిటీష్ ప్రభుత్వం 1929లో *నైట్‌హుడ్* బిరుదుతో రామన్‌ను సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైందని కేవలం *రూ.200* కూడా విలువలేని పరికరాలతో దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైందని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ కొనియాడారు. ఈ పరిశోధనను గుర్తించిన రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్రానికి *1930లో నోబెల్ బహుమతి* ప్రధానం చేసింది. సైన్స్‌కు చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు *1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది*. చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్దికై పాటుపడ్డ ఆయన 1970 నవంబర్ 21 కన్నుమాశారు.

*జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు*

🔆 *ఒక అమ్మ కథ* 😢     """"'''''''''''''''''''''"""""""మా అమ్మకు ఒక్క కన్నే ఉండేదిమా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదుఆమె ఎక్...
26/02/2020

🔆 *ఒక అమ్మ కథ* 😢
""""'''''''''''''''''''''"""""""
మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది

మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు

ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది

ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది

ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది

ఇంక అప్పట్నించి చూడండి
”మీ అమ్మ ఒంటి కన్నుది”
అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు

అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే

అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది

ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది

“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను
నువ్వు చచ్చిపో!”

కోపంగా అరిచేసే వాణ్ణి

ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు

నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది

అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది

ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు

ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను

మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది

నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను

అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది

మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు

నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది?

మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను

ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను

ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను

పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను

మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను

బాగా డబ్బు సంపాదించాను

మంచి ఇల్లు కొనుక్కున్నాను

మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను

నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా

ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది

ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!

అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి

ఇంకెవరు?

మా అమ్మ

ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది

“ఎవరు నువ్వు?

ఎందుకొచ్చావిక్కడికి?

నువ్వెవరో నాకు తెలియదు

నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?

ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”

సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను

“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను”

ఆమె అదృశ్యమై పోయింది

“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”

భారంగా ఊపిరి పీల్చుకున్నాను

ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను

కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు

వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను

స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను

ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి

మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది

ఆమె చేతిలో ఒక లేఖ

నా కోసమే రాసిపెట్టి ఉంది

దాని సారాంశం

ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను

నేనింక నీవుండే దగ్గరికి రాను

కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!

ఏం చేయమంటావు?

నిన్ను చూడకుండా ఉండలేకున్నాను

కన్నపేగురా

తట్టుకోలేక పోతోంది

నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు

కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే

వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను

ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు

చిన్నా!

నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది

నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా!

అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను

నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?

నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు

ఒకటి, రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా!”
అని సరిపెట్టుకున్నాను

చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు

ఉత్తరం తడిసి ముద్దయింది

నాకు ప్రపంచం కనిపించడం లేదు

నవనాడులూ కుంగి పోయాయి

భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను

తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?

మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి?

ఎన్ని జన్మలెత్తితే ఆమె ఋణం తీర్చుకోగలను ?

(ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం)

నాస్తి మాతృ సమం దైవం

నాస్తి మాతృ సమః పూజ్యో

నాస్తి మాతృ సమో బంధు

నాస్తిమాతృ సమో గురుః

అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు

తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు

ఆకలేసినా..

ఆనందం వేసినా
దిగులేసినా
దుఃఖం ముంచుకొచ్చినా
పిల్లలకైనా
పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా
గుర్తొచే పదం అమ్మ

తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ

అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి

కనుపాప లా కాపాడండి

ఒక్కసారి ఆలోచించండి

నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి

బంధాలు బాంధవ్యాలను కాపాడుదాం

తల్లి ఋణం ఈ జన్మకి తీరదు

🙏మాతృదేవోభవ🙏

💰💰💰💰💰
05/02/2020

💰💰💰💰💰

Address

Bangalore
560048

Alerts

Be the first to know and let us send you an email when India Tech Star posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to India Tech Star:

Share