05/09/2026
ఒక చిన్న టౌన్…
అక్కడ ఒక చిన్న ఇల్లు.
ఆ ఇంట్లో ఒక నాన్న…
ఒక అమ్మ…
ఒక పాప… ఒక బాబు…
నాన్నకి ఒక చిన్న ఉద్యోగం.
ప్రతి ఉదయం నాన్న ఆఫీస్‌కి వెళ్తాడు.
పిల్లలు స్కూల్‌కి వెళ్తారు.
అమ్మ అందరినీ సిద్ధం చేసి,
వంట చేసి భోజనం పెడుతుంది.
సాయంత్రం అందరూ ఇంటికి చేరుకుంటారు.
కాసేపు టీవీ చూస్తూ…
అందరూ కలిసి భోజనం చేస్తారు.
రోజంతా అలసిపోయిన తర్వాత…
అందరూ డాబా మీద పడుకుంటారు.
చల్లటి గాలి…
ఆకాశంలో నక్షత్రాలు…
పక్కనే తన కుటుంబం…
పెద్ద ఇల్లు లేదు.
పెద్దగా డబ్బు లేదు.
కానీ మనశ్శాంతి ఉంది.
కుటుంబం ఉంది.
ప్రేమ ఉంది.
Simple life❤️