22/05/2026
అమరావతిలో బాబు లూటీ
సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ అవినీతి, దోపిడీతో మాఫియా రాజ్యం నడుపుతున్నారు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
రాష్ట్రాన్ని జంగిల్ రాజ్యంగా మార్చేశారు
చదరపు అడుగుకు ఏకంగా రూ.20,427తో శాశ్వత భవనాల నిర్మాణం
ఇంటీరియర్, ఇతర వసతి సౌకర్యాలు కలుపుకుంటే ఇది ఎంతవుతుందో!
పాత కాంట్రాక్టులు రద్దు చేసి.. అధిక ధరలతో తిరిగి వారికే కట్టబెట్టిన ప్రభుత్వం
స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, అద్దాల ఫిటింగ్, డిజైన్ తదితర పేర్లతో అదే కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా దోచిపెడుతున్నారు
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 5 స్టార్ వసతులకు చదరపు అడుగు 4,500 మాత్రమే..? సెక్రటేరియట్ బిల్డింగ్, హైకోర్టు, అసెంబ్లీకి కలిపి ఏకంగా రూ.14 వేల కోట్లకు పైగా వ్యయం
బినామీలకు రాజధానిలో రోడ్ల పక్కన.. రైతులకు కుంటల్లో, చెరువుల్లో ప్లాట్లు