Big Bharath

Big Bharath Film Updates , Celebrities Interview , Celebrity Pics ,Tollywood Celebrities News ,Film News ..etc

  Movie
12/06/2026

Movie

12/06/2026
  June 12 Release
12/06/2026

June 12 Release

06/06/2026

Hero & Director Pressmeet

జూన్ 19, 2026 నుండి ఓటీటీలోకి వస్తున్న “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)”దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన, అమెరిక...
02/06/2026

జూన్ 19, 2026 నుండి ఓటీటీలోకి వస్తున్న “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)”

దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన, అమెరికన్ నటి Jo Sharma హీరోయిన్ గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు మరియు సినీ విమర్శకుల నుంచి విశేష ఆదరణను పొందింది.

Jo Sharma, సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఐఎండీబీలో 9.1/10, బుక్ మై షోలో 9.6/10 వంటి అద్భుతమైన రేటింగ్స్‌ను సాధించింది. అలాగే పలు ప్రముఖ దినపత్రికలు, టెలివిజన్ ఛానెల్లు మరియు వినోద వెబ్‌సైట్లు ఈ చిత్రానికి 5లో 3.5 వరకు రేటింగ్స్ ఇస్తూ ప్రశంసించాయి. భారత్‌తో పాటు అమెరికాలోని ప్రేక్షకులు కూడా ఈ చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకుంటూ, ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ సస్పెన్స్ థ్రిల్లర్లలో ఒకటిగా అభివర్ణించారు.

థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఇప్పుడు “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం జూన్ 19 నుంచి లయన్స్‌గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, జియోటీవీ, టాటా ప్లే బింజ్ తదితర ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కానుంది.

మోహన్ వడ్లపట్ల రూపొందించిన ఈ చిత్రం సస్పెన్స్, మిస్టరీ, డ్రామా మరియు వినోదాన్ని సమర్థవంతంగా మిళితం చేస్తూ ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రూపొందిన ఈ చిత్రం, తెలివైన థ్రిల్లర్లు మరియు మర్డర్ మిస్టరీలను ఇష్టపడే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది.

ఈ చిత్రాన్ని రూపొందించడంలో దర్శకుడు మోహన్ వడ్లపట్ల అసాధారణ ప్రతిభను కనబరిచారు. అనూహ్యమైన మలుపులు, ఉత్కంఠభరితమైన కథనం, బలమైన స్క్రీన్‌ప్లేతో చివరి క్షణం వరకు అసలు హంతకుడు ఎవరో ప్రేక్షకులను ఊహాగానాల్లో ముంచెత్తారు. ఆసక్తికరమైన కథనం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు మరియు షాకింగ్ క్లైమాక్స్ ఈ చిత్రాన్ని మిస్టరీ, థ్రిల్లర్ అభిమానులు తప్పక చూడాల్సిన చిత్రంగా నిలబెట్టాయి.

ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి హీరోయిన్ Jo Sharma నటన. దర్యాప్తు జర్నలిస్ట్ రాధ పాత్రలో ఆమె అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారు. సహజమైన నటనతో పాత్రకు లోతు, ఆత్మవిశ్వాసం మరియు వాస్తవికతను జోడించారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలు మరియు శక్తివంతమైన నటన ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలను అందుకొని చిత్రంలోని అత్యంత బలమైన అంశాల్లో ఒకటిగా నిలిచాయి.

కాబట్టి సినీ ప్రేక్షకులు జూన్ 19 నుంచి తమ ఇళ్లలోనే కూర్చొని “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” అందించే మిస్టరీ, సస్పెన్స్ మరియు ఉత్కంఠభరితమైన అనుభూతిని ఆస్వాదించవచ్చు.
..........................................

(Motive For Murder) Set for OTT Release from June 19, 2026 directed by , starring Jo Sharma USA.

The suspense thriller (Motive For Murder), which was released worldwide in theaters on May 8 directed/produced by Mohan Vadlapatla starring American Actress Jo Sharma and Sambeet Acharya, received an excellent response from audiences, media and critics alike. The film earned impressive ratings, including 9.1/10 on IMDb and 9.6/10 on BookMyShow, along with positive reviews from several leading newspapers, news channels and entertainment websites, with ratings ranging from 3.5 out of 5. Audience from both India and USA, celebrated the movie success marking it as one of best suspense thrillers watched in recent times.

Following its successful theatrical run, M4M is now gearing up for its digital premiere. The movie will be available for streaming from June 19 onwards across multiple OTT platforms, including Lionsgate Play, Amazon Prime, Airtel Xstream, JioTV, Tata Play Binge and other partner platforms.

A film by Mohan Vadlapatla, M4M (Motive For Murder) successfully combines suspense, mystery, drama and entertainment, delivering an edge-of-the-seat experience that keeps viewers captivated from beginning to end. The film is particularly well-suited for OTT audiences and is expected to attract viewers who enjoy intelligent thrillers and murder mysteries.

Director Mohan Vadlapatla has done an exceptional job in crafting this suspense thriller. With a gripping screenplay packed with unexpected twists and turns, he keeps the audience guessing about the identity of the killer until the very last minute. The film’s engaging narrative, suspenseful storytelling and surprising climax make it a must-watch for fans of mystery and thriller genres.

One of the major highlights of the film is the outstanding performance by Jo Sharma, heroine of the movie who plays the role of an investigative journalist Radha. She has delivered a remarkable performance with natural acting bringing depth, confidence and authenticity to her character. Her screen presence, expressions and powerful acting have been widely appreciated and stand out as one of the strongest elements of the movie.

Movie lovers can now experience the mystery, suspense and excitement of M4M (Motive For Murder) from the comfort of their homes starting June 19.

02/06/2026

Movie Teaser Event

For Film Promotion contact 9550889907

‘త్రికాల’ మూవీ రివ్యూతెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన‌ మూవీ ‘త్రికాల’. ఎ స్క్...
29/05/2026

‘త్రికాల’ మూవీ రివ్యూ

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన‌ మూవీ ‘త్రికాల’. ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనేది స‌బ్‌టైటిల్. దర్శకుడు మణి తెల్లగూటి తెరకెక్కించిన ఈ సినిమా కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, మానసిక భయం, మానవ భావోద్వేగాలను ఒకే కథలో మిళితం చేసిన విజువల్ వండ‌ర్. టీజర్, ట్రైలర్, పోస్టర్లు చూసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం, ‘తుంబాడ్’, ‘కాంతార’ తరహా డార్క్ మిస్టిక్ వరల్డ్‌ను గుర్తు చేసింది. తాజాగా చాగంటి ప్రొడ‌క్ష‌న్ ‘త్రికాల’ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేసింది. ఇంత‌కీ మూవీ ఎలా ఉందో రివ్యూ రిపోర్ట్‌లో తెలుసుకుందాం.

కథ:
శ‌తాబ్దాల క్రితం “కుమారి ఖండం” అనే ఒక పౌరాణిక భూభాగంలో కథ ప్రారంభమవుతుంది. అక్కడి మునులు అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలు, ప్రాచీన సాంకేతిక రహస్యాలను అసురుల చేతికి చిక్కకుండా రహస్య ప్రదేశంలో దాచిపెడతారు. ఆ సీక్రెట్స్‌ను కాపాడేందుకు “శక్తి ఏథా” అనే దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులపై పోరాడుతూ అతడు మరణించగా, మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి భారీ ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని వారు చెబుతారు.

ప్రస్తుత కాలంలో శివ (మాస్టర్ మహేంద్రన్) అనే యువకుడు అదృశ్యమైన తన ప్రేయసి నిధి (సాహితి) కోసం నగరానికి వస్తాడు. అతని దగ్గర ఒక దుష్టశక్తి ఆవహించిన ఫోన్ ఉంటుంది. ఈ క్రమంలో అతనికి వైతరణ్ (అజయ్) అనే విచిత్రమైన వ్యక్తి గురించి తెలుస్తుంది. సూర్యరశ్మిని తట్టుకోలేని ‘పోర్ఫిరియా’ వ్యాధితో బాధపడుతున్న వైతరణ్, నిజానికి పునర్జన్మ ఎత్తిన త్రికాలవర్మ. కుటుంబ సంఘర్షణలు, మానసిక వేదనలతో అతను తన తండ్రిని, పినతల్లి (ఆమని)ని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ అతని ఆత్మ ఒక భయానక బంగ్లాలోనే సంచరిస్తూ ఉంటుంది.

సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) ఆ ఇంట్లో చిక్కుకుపోతుంది. మరోవైపు అసుర రాజు తిరిగి భూమిపై ఆధిపత్యం సాధించేందుకు మేల్కొంటాడు. అప్పుడు దర్వాడి తాంత్రిక తెగ ఆ మాయా అండాన్ని యాక్టివేట్ చేసి, త్రికాలవర్మ ఆత్మను తిరిగి ఎలా మేల్కొలిపింది? శివకు ఈ కథతో ఉన్న అసలు సంబంధం ఏమిటి? చివరకు అసుర శక్తులపై విజయం సాధించారా? అనేదే సినిమా అసలు కథ.

ప్లస్ పాయింట్స్:

1. కాన్సెప్ట్ & రైటింగ్:
‘త్రికాల’లో అత్యంత బలమైన అంశం దాని కాన్సెప్ట్. కర్మ సిద్ధాంతాన్ని కేవలం డైలాగ్స్ రూపంలో కాకుండా, పాత్రల మానసిక స్థితి, వారి గతం, పునర్జన్మల ద్వారా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మిళితం చేయడం సినిమాలో ప్రధాన బలం.

1. పాత్రల రూపకల్పన:
వైతరణ్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ. సూర్యకాంతిని తట్టుకోలేని ఒక మనిషి, మానసిక ఒత్తిడి, అంతర్మథనం, భయం, దుష్టశక్తి మధ్య చిక్కుకున్న పాత్రగా అజయ్ అద్భుతంగా కనిపించాడు. అతని కోసం ప్రత్యేకంగా రూపొందించిన మాస్క్‌లు, కాస్ట్యూమ్స్, డార్క్ విజువల్ ట్రీట్‌మెంట్ చాలా కొత్తగా ఉన్నాయి.

హీరో మాస్టర్ మహేంద్రన్ ఈ సినిమాలో చాలా నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అమాయకత్వం, ప్రేమ, భయం, భావోద్వేగం.. ఇలా విభిన్నమైన ఎమోషన్స్‌ను చాలా ఈజ్‌తో చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన బాగా కనెక్ట్ అవుతుంది.

శ్రద్ధా దాస్ ఈ సినిమాకు మ‌రో హైలైట్‌. త‌న‌ పాత్రలో గ్లామర్ కంటే మిస్టరీ ఎక్కువగా కనిపిస్తుంది. సైకియాట్రిస్ట్ పాత్రలో చాలా కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు స్పెష‌ల్ డార్క్ టోన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా హారర్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె యాక్టింగ్ ఆకట్టుకుంటుంది.

సీనియర్ నటి ఆమని పాత్ర కూడా సినిమాకు కీలకం. తల్లితనంతో పాటు భయం, బాధ, అనుమానం వంటి భావోద్వేగాలను చాలా సహజంగా చూపించింది. ఆమె పాత్ర కథలో ఎమోషనల్ వెయిట్‌ను పెంచుతుంది. ఆమని నట‌నానుభవం ప్రతి సీన్‌లో కనిపిస్తుంది.

దర్శకుడు మణి తెల్లగూటి ప్రతిభ
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు “టెక్నికల్ ఫిల్మ్ మేకర్”గా మణి తెల్లగూటి పేరు వినిపించడం యాదృచ్ఛికం కాదు. ఆయన దర్శకత్వం ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణ దర్శకులు షూటింగ్ తర్వాత VFX గురించి ఆలోచిస్తే, మణి మాత్రం కథ రాసే దశ నుంచే ప్రతి ఫ్రేమ్‌ను విజువల్‌గా డిజైన్ చేసినట్లు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

‘త్రికాల’లో ప్రతి షాట్‌కు ఒక ప్రత్యేకమైన “డార్క్ విజువల్ లాంగ్వేజ్” ఉంది. మైథాలజీ, తాంత్రిక శక్తులు, సైకాలజికల్ హారర్ అంశాలను ఒకే ప్రపంచంగా చూపించేందుకు ఆయన ఎంచుకున్న ఫ్రేమింగ్ స్టైల్ ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే నీడలు, ఖాళీ కారిడార్లు, మసక వెలుతురు, నెమ్మదిగా కదిలే కెమెరా కూడా సినిమాపై ఉత్కంఠ‌త‌, ఆస‌క్తి పెంచుతూ ఉంటుంది. దర్శకుడి విజన్ వల్లే ఈ సినిమా ఒక “డార్క్ మిస్టిక్ యూనివర్స్”లా అనిపిస్తుంది.

ఎడిటింగ్ విషయంలో కూడా మణి పని చాలా భిన్నంగా ఉంది. సాధారణ కమర్షియల్ కట్‌లకు బదులుగా, సౌండ్ డిజైన్, విజువల్ రిథమ్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాటిక్ కటింగ్ విధానం వాడినట్లు తెలుస్తోంది. అందుకే ట్రైలర్‌లోని ప్రతి షాట్ థియేటర్లలో ప్ర‌త్యేక‌మైన‌ అనుభూతిని కలిగిస్తుంది.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, భారీ సెట్లు లేకపోయినా, ఫ్రేమ్ కంపోజిషన్, డిజిటల్ ఎక్స్‌టెన్షన్స్, CGI బ్యాక్‌డ్రాప్స్ ద్వారా గ్రాండ్ విజువల్ స్కేల్ తీసుకురావడం దర్శకుడి ప్రధాన బలం. చాలా సన్నివేశాల్లో “హాలీవుడ్ డార్క్ ఫాంటసీ” తరహా విజువల్ టోన్ కనిపిస్తుంది.

పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్:
సమకాలీన తెలుగు సినిమాలో సరికొత్త విజువల్ స్టైల్‌ను తీసుకొస్తున్న సినిమాటోగ్రాఫర్లలో పవన్ చెన్నా ఒకరు. ఆయ‌న కెమెరా కేవలం పాత్రల‌నే కాదు, ప్రతి ఫ్రేమ్ ద్వారా భావోద్వేగాన్ని పలికిస్తుంది.

‘త్రికాల’లో పవన్ చెన్నా విజువల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పౌరాణిక ప్రపంచం, చీకటి బంగ్లాలు, తాంత్రిక శక్తులు, ఆధ్యాత్మిక యుద్ధాలను చూపించేందుకు ఆయన వాడిన లైటింగ్ స్టైల్ అద్భుతంగా ఉంది.

డార్క్ ఇంక్-బ్లాక్ టోన్స్ మధ్య గోల్డెన్ లైట్ బీమ్స్ ఉపయోగించడం వల్ల సినిమాలో ఒక మిస్టిక్ ఫీల్ వచ్చింది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా కనిపించేలా కంపోజ్ చేయడం సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఫీల్ తీసుకొచ్చింది.

వైతరణ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో షాడోస్‌ను వాడిన తీరు, పురాతన గుహల్లో తీసిన వైడ్ షాట్స్, మసక వెలుతురులో కనిపించే దేవాలయ సెట్లు, బంగ్లా కారిడార్లు.. ఇవన్నీ మ‌న‌ల్ని వెంటాడే దృశ్యాలుగా నిలిచిపోతాయి.

ముఖ్యంగా హారర్ సీన్స్‌లో కెమెరా మూమెంట్స్ చాలా స్లోగా, అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేలా డిజైన్ చేయడం వల్ల ప్రేక్షకుడు కూడా ఆ భయాన్ని అనుభూతి చెందుతాడు. కొన్ని సన్నివేశాల్లో కేవలం లైటింగ్‌తోనే టెన్షన్‌ను క్రియేట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.

పవన్ చెన్నా ప్రత్యేకత ఏమిటంటే, తక్కువ బడ్జెట్ ఫ్రేమ్‌ను కూడా రిచ్ విజువల్‌గా మార్చగల సామర్థ్యం. అందుకే ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నింటిలోనూ “బిగ్ స్క్రీన్ విజువల్ ఎక్స్‌పీరియన్స్” ఫీల్ స్పష్టంగా కనిపిస్తోంది.

సంగీతం & బీజీఎం:
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వరం అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం. మెయిన్ హైలైట్ గా నిలిచి సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. దాంతో పాటు SHAJITH HUMAYUN అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా హారర్, తాంత్రిక సీన్ల‌లో BGM భయాన్ని మరింత పెంచింది. కొన్ని సీన్ల‌లో మ్యూజిక్ కంటే సౌండ్ డిజైన్‌నే ఎక్కువగా ఉపయోగించడం మ‌రింతా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది.

VFX & CGI:
ఈ సినిమాలో VFX చాలా కీలక పాత్ర పోషించింది. మాయా అండం, అసుర శక్తులు, ఆధ్యాత్మిక యుద్ధాలు, ప్రాచీన ప్రపంచాల డిజైన్.. ఇలా విజువ‌ల‌న్నీ రిచ్‌గా కనిపి్తాయి. CGIని అతిగా కాకుండా కథలో భాగంలా ఉపయోగించడం ప్లస్ అయ్యింది.

ప్రత్యేకంగా ఇంట‌ర్వ‌ల్ బ్లాక్‌లో వచ్చే VFX సీక్వెన్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచేలా ఉంటుంది. Practical lighting + CGI blend technique సినిమాకు మరింత రియలిస్టిక్ ఫీల్ ఇచ్చింది.

ప్ర‌తి ఫ్రేమ్ క్వాలిటీగా..
నిర్మాత రాధికా శ్రీనివాస్ ఈ సినిమాను చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. స్క్రీన్‌పై ప్రతి ఫ్రేమ్‌లోనూ క్వాలిటీ కనిపించేలా ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా సెట్స్, కాస్ట్యూమ్స్, VFX, కలర్ టోన్, టెక్నికల్ స్టాండర్డ్స్.. అన్నీ క‌లిపి సినిమాకు హై బడ్జెట్ థియేట్రికల్ ఫీల్ తీసుకొచ్చాయి. కొత్త కాన్సెప్ట్‌లను నమ్మి ఇలాంటి విజువల్ డ్రివెన్ సినిమాను నిర్మించడం నిర్మాత అభిరుచిని చూపిస్తుంది.

ఫైన‌ల్‌గా చెప్పాలంటే..
‘త్రికాల’ రొటీన్ హారర్ సినిమా కాదు. ఇది మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ, విజువల్ థ్రిల్లర్‌ల మేళవింపు. స్టోరీ, విజువల్స్, BGM, టెక్నికల్ ఎగ్జిక్యూషన్.. ఇవ‌న్నీ క‌లిపి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

మొత్తంగా పౌరాణిక రహస్యాలు.. కర్మ సిద్ధాంతం.. డార్క్ ఫాంటసీ.. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కలయికగా ‘త్రికాల’ను చెప్పుకోవ‌చ్చు. పౌరాణిక రహస్యాలు, ఆధ్యాత్మిక కాన్సెప్ట్స్, హాలీవుడ్ తరహా డార్క్ విజువల్ అనుభూతిని ఇష్టపడే ప్రేక్షకులకు ‘త్రికాల’ స‌రికొత్త అనుభవాన్ని అందిస్తుంద‌ని నిస్సందేహంగా చెప్పొచ్చు.

రేటింగ్: 3.5/5
.......

*‘ ’ Movie Review* (Telugu Movie)

Trikaala: A Script of God is a new-age mythological dark thriller that brings together karma philosophy, reincarnation, ta***ic powers, psychological fear, and emotional drama into one visually immersive cinematic experience. Directed by Mani Tellagooti, the film had already generated strong curiosity through its teaser, trailer, and posters, reminding audiences of dark mystical worlds seen in films like Tumbbad and Kantara. Released worldwide by Chaganti Productions, Trikaal attempts to create a unique mythological horror universe on the big screen.

Story
The story begins centuries ago in the mythical land of “Kumari Khandam,” where sages hide powerful ta***ic scriptures and ancient technological secrets to prevent them from falling into the hands of demonic forces. To protect these secrets, they create a divine weapon called “Shakti Aetha” and entrust it to the warrior king Trikaal Varma. During a fierce battle against evil forces, Trikaal Varma dies, and the sages imprison his soul inside a mystical cosmic egg, predicting that he will awaken again in the Kali Yuga when humanity faces its greatest threat.

In the present day, Shiva (Master Mahendran) arrives in the city searching for his missing lover Nidhi (Sahithi). He carries a haunted mobile phone possessed by dark energy. During his search, he discovers the mysterious Vaitaran (Ajay), a man suffering from Porphyria, a rare condition that prevents him from tolerating sunlight. However, Vaitaran is actually the reincarnation of Trikaal Varma.
Tormented by emotional trauma and psychological conflict, Vaitaran murders his father and stepmother (Aamani) before taking his own life. Yet his spirit continues to haunt a terrifying mansion. Psychiatrist Maya (Shraddha Das) becomes trapped inside the house, while an ancient demon king prepares to rise again and reclaim dominance over Earth.
How the Darwadi ta***ic tribe reactivates the mystical cosmic egg, how Trikaal Varma’s soul returns, and Shiva’s true connection to this supernatural battle form the core of the story.

*Plus Points*

Concept & Writing
The strongest aspect of Trikaal is undoubtedly its concept. Rather than simply discussing karma and reincarnation through dialogues, the film visualizes these themes through layered character arcs, psychological trauma, and spiritual conflict. The blend of mythology with modern-day horror elements gives the film a fresh cinematic identity.

Performances
Ajay delivers one of the film’s most memorable performances as Vaitaran. His portrayal of a mentally disturbed man trapped between darkness, fear, and supernatural forces is intense and haunting. The specially designed masks, costumes, and dark visual styling around his character add depth to the role.
Master Mahendran gives a natural and emotionally engaging performance. He handles innocence, fear, romance, and emotional breakdowns with ease, especially in the climax portions where his emotional scenes connect strongly with the audience.

Shraddha Das is another major highlight of the film. Her role carries more mystery than glamour, and she delivers a controlled yet impactful performance as psychiatrist Maya. Her screen presence enhances the film’s dark tone, particularly during the horror and emotional sequences.

Veteran actress Aamani also leaves a strong impact. She portrays motherhood, fear, emotional pain, and suspicion with remarkable authenticity, adding emotional weight to the narrative.

Director Mani Tellagooti’s Vision
Director Mani Tellagooti proves himself to be a technically strong filmmaker with a clear cinematic vision. Unlike conventional filmmakers who focus on VFX only during post-production, Mani appears to have designed every frame visually right from the scripting stage.
Each shot in Trikaal follows a distinct dark visual language. Through shadow-heavy frames, empty corridors, dim lighting, and slow camera movements, he builds a haunting atmosphere that constantly creates suspense and uneasiness. The film often feels like an expansive “dark mystic universe.”
His editing approach also stands out. Instead of relying on commercial fast-cut editing, the film focuses more on cinematic rhythm, sound design, and visual mood. Even the trailer shots feel designed specifically for a theatrical big-screen experience.

One of the film’s biggest strengths is how it achieves a grand scale despite not relying heavily on massive physical sets. Through smart frame composition, CGI backdrops, and digital extensions, Mani creates visuals that often resemble Hollywood dark fantasy cinema.
Pawan Channa’s Visual Magic
Cinematographer Pawan Channa elevates the film significantly with his visual storytelling. His camera captures not just the characters, but the emotions hidden within every frame.
The film’s lighting design is exceptional, especially in scenes involving mythology, ancient temples, haunted mansions, and spiritual warfare. The use of deep black tones combined with golden light beams creates a rich mystical atmosphere.
Several frames resemble gothic paintings, giving the movie an international dark fantasy aesthetic. The use of shadows in Vaitaran’s scenes, wide-angle shots inside ancient caves, and dimly lit temple corridors leave a lasting visual impact.
Particularly in horror sequences, the slow and uncomfortable camera movements make viewers feel trapped within the fear itself. In many scenes, tension is created purely through lighting and framing rather than jump scares.
Pawan Channa’s greatest strength lies in making even limited-budget frames appear visually rich and cinematic. That is why the film’s posters, teaser, and trailer consistently carry a “big-screen visual experience” feel.

Music & Background Score
Music by Harshavardhan Rameshwar, known for films like Arjun Reddy and Animal, becomes one of the film’s biggest assets. His compositions and sound textures elevate the dark emotional atmosphere effectively.

Additionally, SHAJITH HUMAYUN’s background score gives life to the film’s horror and ta***ic sequences. In several scenes, sound design takes precedence over traditional music, making the experience more immersive and unsettling.

VFX & CGI
VFX plays a crucial role in Trikaal. The mystical cosmic egg, demonic powers, ancient worlds, and spiritual battle sequences are designed impressively. The CGI never feels excessive and blends naturally into the storytelling.
The interval block especially stands out with its visually stunning VFX work. The combination of practical lighting and CGI integration gives many scenes a realistic fantasy feel.

Production Values
Producer Radhika Srinivas has mounted the film with rich production values. Every frame reflects quality in terms of costumes, set design, VFX, color grading, and technical presentation. Supporting a visually ambitious concept like this shows the producer’s confidence in experimental storytelling.

Final Verdict
Trikaala is not a routine horror film. It is a blend of mythology, psychological horror, dark fantasy, and visual thriller elements. Its storytelling, visuals, background score, and technical ex*****on combine to create a unique cinematic experience.

With mythological mysteries, karma philosophy, spiritual concepts, and Hollywood-style dark visuals, Trikaal offers something fresh for audiences looking beyond conventional commercial cinema. Fans of mystical thrillers and atmospheric dark fantasy films are likely to enjoy this immersive experience.

Rating: 3.5/5

మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’▪️ సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫి...
27/05/2026

మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’

▪️ సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్
▪️ హై క్వాలిటీ VFX, గ్రాండ్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ
▪️ ట్రైలర్‌, పాటలకు భారీ స్పందన.. పెరిగిన అంచనాలు
▪️ చాగంటి ప్రొడక్షన్ LLP సమర్పణలో వరల్డ్‌వైడ్ రిలీజ్
▪️ సినిమాకు హైలైట్‌గా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం

భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ప్రపంచవ్యాప్తంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించగా, చాగంటి ప్రొడక్షన్ LLP ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో రూపొందించిన విజువల్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది కేవలం సాధారణ హారర్ చిత్రం కాకుండా దైవిక శక్తులు, అతీత శక్తుల మధ్య జరిగే సస్పెన్స్‌భరితమైన మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు తెలుస్తోంది.

హైఎండ్ VFX, అద్భుతమైన కెమెరా వర్క్ సినిమాకు మరింత గ్రాండియర్ తీసుకువచ్చాయి. ముఖ్యంగా “అమ్మ” పాట ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. శ్రద్ధాదాస్ కొత్త లుక్‌, మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ‘త్రికాల’ టైటిల్ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…
“ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే ఒక శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ సాగుతుంది. సనాతన ధర్మంలోని కొన్ని ఆధ్యాత్మిక అంశాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుంది” అని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ…
“మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, థ్రిల్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘త్రికాల’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది” అని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన అందించిన మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి నార్త్ ఇండియాలో కూడా మంచి బిజినెస్ జరిగినట్లు సమాచారం. హిందీ శాటిలైట్ హక్కులతో పాటు డబ్బింగ్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రద్ధాదాస్, ‘ఆర్య 2’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ‘త్రికాల’లో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొత్తంగా మైథలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ‘త్రికాల’ మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Trikala Movie Trailer : https://youtu.be/U098Oyg8nYo?si=bW9YTbuj4HhGK1u-

నటీనటులు:
శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవంచ, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి తదితరులు.

సాంకేతిక విభాగం:
సమర్పణ & విడుదల: చాగంటి ప్రొడక్షన్ LLP
నిర్మాతలు: రాధిక–శ్రీనివాస్
సహ నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి
కథ, దర్శకత్వం: మణి తెల్లగూటి
డీవోపీ: పవన్ చెన్న
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: షాజిత్ హుమాయున్
పీఆర్ఓ: అశోక్ దయ్యాల...................................................

Mythological Thriller ‘Trikaal’ Starring Shraddha Das Set for Worldwide Release on May 28

▪️ A mythological fictional thriller based on the hidden spiritual secrets of Sanatana Dharma
▪️ High-quality VFX and grand visuals are the major highlights
▪️ Trailer and songs receive tremendous response, raising expectations
▪️ Worldwide release by Chaganti Production LLP
▪️ Music by Harshavardhan Rameshwar adds strength to the film

The mythological fictional thriller Trikaal, inspired by the spiritual mysteries hidden within Indian Sanatana Dharma, is all set for a worldwide theatrical release on May 28. Popular actress Shraddha Das plays the lead role in the film, while Master Mahendran, Ajay, and senior actress Aamani appear in pivotal roles. The film is written and directed by Mani Tellaguti and produced by Radhika–Srinivas, with Chaganti Production LLP presenting and distributing it worldwide.

The recently released trailer, promotional content, and songs have generated massive buzz and significantly increased expectations for the film. The visuals shot in forest backdrops, thrilling narrative elements, and spine-chilling background score have especially impressed audiences. Going by the trailer, Trikaal appears to be more than just a conventional horror film, blending divine and supernatural powers into an intense mythological suspense thriller.

The film’s high-end VFX work and stunning cinematography further elevate its grandeur. In particular, the emotional song “Amma” has struck a chord with audiences and heightened curiosity around the movie. Shraddha Das’s new look, Master Mahendran’s action sequences, and Ajay’s powerful character have become talking points among movie lovers. Even the title Trikaal has turned into a hot topic within the industry.

Speaking about the film, director Mani Tellaguti said:

“Trikaal revolves around a powerful force that emerges as light during a time when darkness engulfs the world. We blended certain spiritual elements of Sanatana Dharma with thrilling cinematic moments to create this film. The trailer and songs have already received an overwhelming response, and audiences are going to experience something truly unique.”

The producers stated:
“This film, made with a mythological touch, will appeal to audiences of all sections. Trikaal is a unique blend of culture, spirituality, and thrilling elements, offering viewers a completely new cinematic experience.”

The music for the film is composed by Harshavardhan Rameshwar, who is known for his work in films like Arjun Reddy, Animal, and Spirit. The film team believes that his music and background score will stand out as one of the major strengths of Trikaal.

According to industry sources, the film has already generated good business in North India as well. Reports suggest that the Hindi satellite rights and dubbing rights have been sold for a fancy price.

Shraddha Das, who made her Tollywood debut with Siddu from Srikakulam, gained popularity through films like Arya 2, Guntur Talkies, Ek Mini Katha, Dictator, and Nagavalli. She is now set to appear in yet another unique role in Trikaal.

Overall, with its mythological thriller backdrop, spiritual themes, supernatural elements, and grand cinematic presentation, Trikaal has created strong excitement among cinema audiences ahead of its worldwide release on May 28.

Trikala Movie Trailer : https://youtu.be/U098Oyg8nYo?si=bW9YTbuj4HhGK1u-

Cast
Shraddha Das, Master Mahendran, Ajay, Aamani, Sahithi Avancha, Prabhakar, Ambati Arjun, Rowdy Rohini and others.

Technical Team
Presentation & Distribution: Chaganti Production LLP
Producers: Radhika–Srinivas
Co-Producers: Sri Saideep Chatla, Venkat Ramesh Dadi
Story & Direction: Mani Tellaguti
Director of Photography: Pawan Chenna
Music: Harshavardhan Rameshwar
Background Score: Shajith Humayun
PRO: Ashok Dayyala

Breaking ప్రముఖ చిత్ర నిర్మాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్.బి. చౌదరి దుర్మరణం గఉదయ్‌పూర్‌లో జరిగిన ఒక ఘోర కారు ప్రమాదంలో మృతి...
05/05/2026

Breaking

ప్రముఖ చిత్ర నిర్మాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్.బి. చౌదరి దుర్మరణం

గఉదయ్‌పూర్‌లో జరిగిన ఒక ఘోర కారు ప్రమాదంలో మృతి

పలు భాషల్లో దాదాపు 90 పైగా చిత్రాలను నిర్మించిన ఆర్ బి చౌదరి

తెలుగులో రాజా , సూర్యవంశం , సుస్వాగతం వంటి పలు చిత్రాలు నిర్మించారు

PRO 095508 89907 *ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి**-సౌత్ ఇండియన్ అంటే చాలా ఇష్టం:- హీరోయిన్ రెజీనా కసాండ్రా* *హీరోయ...
13/03/2026

PRO 095508 89907
*ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి*
*-సౌత్ ఇండియన్ అంటే చాలా ఇష్టం:- హీరోయిన్ రెజీనా కసాండ్రా*

*హీరోయిన్ రెజీనా చేతుల మీదుగా శ్రీకాకుళంలో ‘కలర్స్ 2.0’ ప్రారంభం*

▪️ *53వ బ్రాంచీ లాంచ్ చేసిన‌ ‘క‌ల‌ర్స్ హెల్త్‌కేర్’*
▪️ *అట్టహాసంగా ప్రారంభోత్స‌వ వేడుక‌*
▪️ *ఆధునిక టెక్నాల‌జీతో 'కలర్స్ 2.0' ట్రీట్‌మెంట్*

*-అత్యుత్తమ టెక్నాలజీ సహాయంతో కలర్స్ వెల్నెస్ లో సేవలు:-కలర్స్ యాజమాన్యం*

*శ్రీకాకుళం:-*
ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్ (Kolors)’ తన నూతన బ్రాంచ్ కలర్స్ 2.0ను ఘనంగా ప్రారంభించింది. శ్రీకాకుళం న‌గ‌రంలోని పాలకొండ రోడ్డు, పాండురంగ వీధిలో ఏర్పాటు చేసిన ‘కలర్స్ (Kolors) హెల్త్‌కేర్’ నూత‌న బ్రాంచీని హీరోయిన్‌ రెజీనా కాసాండ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఒత్తిడిని అధిగమించడం, అధిక ఆలోచనలను దూరం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, అందం పొందవచ్చని అన్నారు. తనకు సౌత్ ఇండియా ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. వెజిటేబుల్ కు ప్రాధాన్యత ఇస్తానన్నారు.
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం, అందంపై శ్రద్ధ వహించడం ఎంతో అవసరం. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన బరువు తగ్గడం, జుట్టు, చర్మ సమస్యలకు అత్యాధునిక చికిత్సలను శ్రీకాకుళం ప్రజల కోసం క‌ల‌ర్స్ హెల్త్‌కేర్ సంస్థ‌ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. కలర్స్ సంస్థ అందిస్తున్న సేవలు ఇప్పటికే ఎందరిలోనో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి అని’’ ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా .మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, " శ్రీకాకుళం బ్రాంచ్‌ను ఆవిష్కరించిన రెజినా కు కృతజ్ఞతలు. 22 ఏళ్ల అనుభవం మాకు మరింత నమ్మకం ఇచ్చింది. నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాం. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సలను అందిస్తున్నాం ఆరోగ్యంగా, అందంగా ఉండాలన్న ప్రతి ఒక్కరి ఆశకు కలర్స్ హెల్త్ కేర్ ఎల్లప్పుడూ తోడ్పడుతుంది” అని అన్నారు.

కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ పుట్టిన ఊరు శ్రీకాకుళంలో సెంటర్ ప్రారంభించడం ఎంతో సంతోషమన్నారు. తమకు చెన్నైలో ఉన్న స్టోర్ కి ఇక్కడ ఏర్పాటుచేసిన స్టోర్ కి తేడా లేకుండా ఆధునాతనమైన సేవలు అందిస్తామన్నారు.
‘‘రెండు ద‌శాబ్దాల‌కు పైగా హెల్త్‌కేర్ రంగంలో విశేష గుర్తింపు పొందిన కలర్స్, ఇప్పుడు 'కలర్స్ 2.0' పేరుతో మరింత ఆధునిక సాంకేతికతను శ్రీకాకుళం వాసులకు పరిచయం చేస్తోంది. అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో సురక్షితమైన పద్ధతుల్లో చికిత్సలు అందించడమే మా లక్ష్యం. ఇప్ప‌టికే లక్షలాది మంది కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకుని, 53వ బ్రాంచీని స‌గ‌ర్వంగా ఆవిష్క‌రిస్తున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా మా సేవలను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేస్తూ ఇప్పుడు 'కలర్స్ 2.0' గా రూపాంతరం చెందాం. యూఎస్-ఎఫ్‌డీఏ (US-FDA) ఆమోదం పొందిన అత్యాధునిక టెక్నాలజీతో అధిక బరువు, జుట్టు, చర్మ సమస్యలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను శ్రీకాకుళం ప్రజలకు చేరువ చేయడం సంతోషంగా ఉంది" అని తెలిపారు.

కలర్స్ ఆపరేషన్ విభాగ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ ఉత్తమ వెల్నెస్ క్లినిక్ గా కలర్స్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు.
మంచి ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుతూ బరువు తగ్గించడం తమ ప్రత్యేకత అని చెప్పారు. కలర్స్ 2.0 (టూ పాయింట్ ఓ) ను మరింత ఉత్తమంగా తీర్చిదిద్దేలా
2019 లో మరలా తీసుకురావడం జరిగింది అన్నారు. 51 మంది డెర్మటాలజిస్టులు ఉన్న ఏకైక వెల్నెస్ సెంటర్ తమదే అని చెప్పారు.
5ఎం మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అభిమానులు, అతిథులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Big Bharath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Big Bharath:

Share