Kativarapu Collection

Kativarapu Collection This page publish best pictures and locations across the world. The pics of Flowers , animals natural locations also will be uploaded.

This page should given top priority to the Hindu religious, Human values, best quotes and health issues.

13/01/2025
07/01/2025

Very Inspiring Words

*🕉️కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు...!* వారణాసి వెళ్ళే వాళ్ళు  ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి.  సైక...
17/07/2022

*🕉️కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు...!*

వారణాసి వెళ్ళే వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి.

సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300 నుంచి ఛార్జ్ చేస్తారు. తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150 నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా మనిషికి 20ఛార్జ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం, ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది.

ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం ఆరు గంటలకు మీరు బయటకి వచ్చి మొదటగా కాల భైరవ స్వామి దర్శనం చేసుకొని, అక్కడ నుంచి వారాహి అమ్మ దర్శనానికి వెళ్ళండి. ఉదయం 9 గంటలలోపే వారాహి అమ్మ దర్శనం. ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు. వారాహి అమ్మ గ్రామ దేవత.

అక్కడ నుంచి విశాలాక్షి అమ్మ గుడి దగరలో ఉంటుంది. అమ్మ దర్శనం చేసుకొని, విశాలాక్షి అమ్మ గుడి దగర నుంచి విశ్వనాథుని గుడికి
2 నిముషాలలో కాలి నడకన వెళ్లొచ్చు.

1వ నంబర్ గేట్ నుంచి వెల్లినట్లైతే సాక్షి గణపతినీ దర్శించుకోవచ్చు. డుంది గణపతి గుడి లోపల ఉంటుంది. స్వామి వారి దర్శనం 4 వ నంబర్ గేట్ నుంచి త్వరగా అవుతుంది. స్వామి దర్శనం చేసుకొని వచ్చాక లోపల అన్నపూర్ణమ్మ అమ్మ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పూజారికి 100 ఇస్తే అమ్మ వారిని తాకనిస్తారు.

అన్నపూర్ణమ్మ గుడి లోపలి నుంచి అన్న ప్రసాదానికి దారి ఉంటుంది. కచ్చితంగా అక్కడ భోజనం చేయాలి. గుడిలో మనకి అమ్మ ప్రసాదంగా ఒకతను, కొంచెం బియ్యం, ఒక coin (కాసు) ఇస్తారు. 100 రూపాయలు ఇవమంటారు. 50 రూపాయలు ఇచ్చినా కొందరు తీసుకుంటారు. ఆ కాసు మన ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలి. బియ్యం మన ఇంట్లో మనం తెచుక్కున్న బియ్యం బస్తాలలో కొంచెం వేసుకొని మిగతాది బీరువాలో దాచుకోవాలి.

ఫోన్స్, వాల్లెట్స్ అనుమతించరు. ఒకవేళ తీసుకు వెళ్తే 4 వ నంబర్ గేట్ దగర దేవస్థానం వారి ఫ్రీ లాకర్ ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు. సాయంత్రం 6 నుంచి 7 వరకు స్పర్శ దర్శనం ఉంటుంది. 7 కి హారతి సేవ ఉంటుంది. స్వామి దర్శనం ఆదివారాలు సోమవారాలు బాగా రద్దీగా ఉంటుంది.

దర్శనాలు అయిపోయాక మధ్యాహ్నం 1 నుంచి లోకల్ టెంపో మాట్లాడుకొని అన్ని చూసుకోవచ్చు. దుర్గమ్మ గుడి, గవ్వలమ్మ, మందిరం, బెనారుస్ యూనివర్సిటీలో టెంపుల్స్ హనుమాన్ టెంపుల్ ఇవన్నీ లోకల్ టెంపుల్స్ కి మనం మాట్లాడుకునే ఆటో వాళ్ళు చూపిస్తారు. మనిషికి 300 వరకు ఛార్జ్ చేస్తారు. అవి అన్నీ చూసుకునే సరికి సాయంత్రం 6 అవుతుంది. అక్కడ కు దగ్గర్లో ఉండే ఏదైనా ఘాట్ లలో గంగ హారతి చూసుకోవచ్చు. దశాశ్వమేధ ఘాట్, కేదార్నాథ్ ఘాట్ ఆశ్రమానికి దగ్గర్లోనే ఉంటాయి.

రెండవ రోజు ఘాట్లలో స్నానాలు చేసి పడవలు మాట్లాడుకుని 64 ఘాట్లు వెళ్ళటానికి,12 గంటలకి మణికర్ణిక ఘాట్ లో స్నానాలు చేయవచ్చు.

మణికర్ణిక ఘాట్లో స్నానాలు చేస్తే పితృ దేవతలకి మోక్షం లభిస్తుంది అంటారు. స్నానం చేసే సమయంలో మనసులోని కోరికలు నెరవేరుతాయి అంటారు.

మణికర్ణిక ఘాట్ విశ్వనాథ గుడి 4 వ నంబర్ గేట్ నుంచి కొంచెం ముందుకి నడుస్తూ వెళ్తే కుడి చేతి వైపు పెద్ద అర్చ్ కనిపిస్తుంది. దానిలో నుంచి నడుచు కుంటు వెళ్తే ఘాట్ కి వెళ్తాం. దాదాపు ఘాట్లు అన్ని పక్క పక్కనే ఉంటాయి.

వీలైతే కాలభైరవ టెంపుల్ నుంచి వచ్చేప్పుడు మహా మృత్యుంజయ గుడి, ఓంకారేశ్వర మకరేశ్వర్, ఆకరేశ్వర గుడులు చూసుకోవచ్చు. జంగం బాడీ మఠం దాటాక తిలబందేశ్వర్ గుడి ఉంటుంది. కుదిరితే లోలార్కు కుండ్ చూసుకోండి. హిందువులు అక్కడ ఎక్కువగా పుణ్య స్నానాలు ఆచరిస్తారు.

సూర్య భగవానుడు గుడి చిన్న గుడులు అక్కడ పక్కనే ఉంటాయి. దర్శనం చేసుకోండి. తర్వాత శివుని దర్శనం చేసుకోండి.
సదా మీ సేవలో....

32 సంవత్సరాలు వెనక్కి వెళితే, మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్...
14/07/2022

32 సంవత్సరాలు వెనక్కి వెళితే,
మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.
థడ్...థడ్...అని తలుపు చప్పుడు.
తెరిస్తే ఒక వ్యక్తి. 'ఎవరు మీరు?' అంటే, బదులుగా 'మీ అభిమానిని అమ్మా!' అని సమాధానం. లోపలికి తీసుకువచ్చి అన్నం పెట్టి కష్టసుఖాలు అడిగింది ఆ మహానుభావురాలు. తనది కిళ్ళీకొట్టు వ్యాపారం అనీ, ఇప్పుడంతా నష్టపోయానని చెప్పాడు ఆ అభిమాని.
తన దగ్గిర సమాయానికి డబ్బులు లేవు. ఒకప్పుడు బాగా బ్రతికి, పది మందిని బ్రతికించిన ఆమెకి ఊరికే పంపడమంటే ఏంటో తెలియదు. ఆలోచించింది. తన బీరువా గుర్తుకువచ్చింది. తనకి ఎంతో ఇష్టమైన రెండో మూడో పట్టుచీరెలని అందులో దాచుకుంది. ఇప్పుడే వస్తాను బాబూ అని వెళ్ళి ఒక చీరె తీసుకొని చేతులు వెనకపెట్టుకుని అతనికి కనపడకుండా బయటకి వచ్చింది. వీధి చివర తనకి తెలిసినవాడికి ఇచ్చి "అన్నయ్యా, దీన్ని అమ్మి ఎంత వస్తే అంత పట్టుకురా" అని చెప్పింది. తిరిగి లోపలికి వెళ్ళి అభిమానికి భోజనం వడ్డించింది. అరగంటకి ఆ 'అన్నయ్య' వచ్చి ఒక 5000 చేతిలో పెట్టాడు. ఆమె నవ్వుతూ అవి తీసుకొని లోపలకి వెళ్ళింది. కానీ ఆ చీరె విలువ ఆ రోజుల్లోనే 30,000. మిగతా పాతికవేలు ఆ అన్నయ జేబులోకి వెళ్ళాయి. ఆ విషయం తనకి తెలీదు. అంతెందుకు? తన జీవితంలో అసలు డబ్బులు ఎప్పుడూ లెక్కపెట్టలేదు అంటే నమ్ముతారా? ఇలా లెక్కలేనన్ని ఆర్ధిక అవకాశ రాబందులు తన జీవితంలో.
ఇలా ఎన్నున్నా, నటననే ప్రేమించింది కానీ ప్రేమని మాత్రం నటించలేదు.
ఆమె కనురెప్పలే కోటి భావాలు పలికేవి.
మహానటులుకు సైతం ఆమె పక్కన నటించడానికి చెమటలు పట్టేవి.
తెలుగువారు సగర్వంగా చెప్పుకునే 'ఆడతనం' ఆమెది.
30 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానంలో మామూలు నటులు ఎప్పటికీ మోయలేని కిరీటాలని తను చిటికనవేలుతో ఆడించి చూపించింది.
పాత్రలే తనకోసం ఎదురుచూసేవి.
'దేవదాసు' లో విరహాన్ని పొంగించే ఆ కళ్ళు 'మాయాబజార్' లో ఠీవిని పలికించాయి. ఆ కళ్ళే దక్షిణభారతాన్ని అందంగా మోసం చేశాయి. అది నటన కాదు, జీవం అని మనల్ని మరిపించి మురిపించాయి.
ఆ కళ్ళే SVR, MGR, Sivaji Ganeshan, NTR, ANR, Amitabh, Rajnikanth, Kamal haasan లాంటి వారు కూడా ఆమె నటనకి పాదాభివందనం చేసేట్టు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'నీలం సంజీవరెడ్డి' మంత్రులతో సహా ఆమె ముందు రోడ్డు మీద నడుస్తూ ఆమెను ఏనుగు మీద రవీంద్ర భారతి వరకు 'గాజారోహణం' చేయించారు. భారతదేశ సినిమా చరిత్రలో 'ఎవరికీ దక్కని' అరుదైన గౌరవం ఇది.
'ఇప్పటికీ' 'ఎప్పటికీ' తెలుగువారి ఖ్యాతిని అఖండజ్యోతిలా వెలిగించేవాళ్ళలో ముందు వరుసలో వుంటుంది ఆమె నటనా జీవితం.
ఆమే 'సావిత్రి'.
సావిత్రి గారు మనల్ని పొగడమనో, గుర్తుంచుకోమనో ఏ రోజూ అడగలేదు. గాంధీ కూడా ఆయన బొమ్మని నోటు మీద వేయమని అడగలేదు. గొప్పవాళ్ళు ఎవరూ అడగరు. వాళ్ళ సేవని గుర్తుంచుకొని మనమే ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి.
ఒక scene లో మెట్ల మీద నుండి కిందకి దిగాల్సివుంది. తాను చేయాల్సిన scene ఎప్పుడో చేసేసింది. అయినా shooting gap లో expressions లో వ్యత్యాసం అర్ధం చేసుకోవడం కోసం సావిత్రి గారు కొన్ని వందల సార్లు ఆ మెట్లు ఎక్కి దిగారు. ఒక్కో సారి ఒక్కో expression తో. ఏడుస్తున్నప్పుడు ఇలా, కోపంతో ఇలా, నవ్వుతూ ఇలా, గర్వం తో ఇలా దిగాలి అని. అలాంటి సావిత్రి గారి dedication గురించి "అ ఆ ఇ ఈ" లు కూడా తెలియని ఈ కాలపు నటీమణులు తమ అభిమాన నటి సావిత్రి అని చెప్తున్నారు. ఆ మాట నిజంగా వాళ్ళ మనసులోనుండి వస్తే అంత కంటే ఆనందం లేదు. అలా కాకుండా వాళ్ళు సావిత్రి పేరుని impression కోసం వాడుకుంటే, అంతకంటే అవమానం లేదు.
జయంతికి, వర్ధంతికి మాత్రమే గుర్తుచేసుకోవాల్సిన మనిషి కాదు సావిత్రి గారు. తెలుగు సినిమా గాలి వున్నన్ని రోజులు అందులోని పరిమళం లా వుంటుంది ఆమే.

నాన్నకు 6 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి... కొడుకు తన 65% కాలేయాన్ని(liver)  దానం చేయడం ద్వారా కొత్త జీవితాన్ని ఇచ్చాడు!ట్...
13/07/2022

నాన్నకు 6 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి... కొడుకు తన 65% కాలేయాన్ని(liver) దానం చేయడం ద్వారా కొత్త జీవితాన్ని ఇచ్చాడు!

ట్వీట్

ప్రపంచంలోని వేలాది మంది ప్రజలు కుటుంబం కంటే ఎక్కువ మరేమీ కాదు అని నమ్ముతారు, కానీ దానిని నిరూపించగలిగేది కొద్దిమంది మాత్రమే. ఇదే కథ ప్రస్తుతం వార్తల్లో ఉంది ... ఈ కథలో, అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి కొత్త జీవితాన్ని ఇవ్వడం ద్వారా ఒక కొడుకు ఒక ఉదాహరణగా నిలిచాడు... అందుకున్న సమాచారం ప్రకారం, ఆ యువకుడి తండ్రి కాలేయం(liver) కోల్పోయాడు... మరియు అతనికి ఎక్కువ సమయం లేదని, ముందుగానే కాలేయ(liver) మార్పిడి చేయించుకోవాలని డాక్టర్ చెప్పాడు ... దాత అవసరం .. అప్పుడు కొడుకు తన కాలేయంలో(liver) 65 శాతాన్ని తండ్రికి దానం చేశాడు మరియు ప్రపంచంలో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ కథను ఇన్‌స్టాగ్రామ్‌లో 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పేజీ షేర్ చేసింది, ఇది ప్రజల కన్నీళ్లను ఆపడం లేదు ... 👏

ఈ రోజుల్లో ఇలాంటి కొడుకులు ఉన్నారు అంటే చాలా చాలా గ్రేట్ 👏👏

Address

Guntur
522001

Telephone

+19542339966

Website

Alerts

Be the first to know and let us send you an email when Kativarapu Collection posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Kativarapu Collection:

Share