03/03/2024
ఒక అశయం కోసం, అభివృద్ధి కోసం, మా ప్రాంతంలో సాగునీరు, తాగునీరు, విద్య,వైద్యం, ఉపాధి, ఉద్యోగం, మహిళ సాధికారత కోసం గిద్దలూరు నియోజకవర్గం నుండీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఇతరులలాగా అది చేస్తా, ఇదీ చేస్తా,వాళ్ల కోసం పోరాడుతా, అని చెప్పి మోసం చేసే రకం కాదు. నేను ఇచ్చిన ప్రతి హామీకి అప్పులు చేయకుండా, సంపద సృస్టి ద్వారా , చిన్న, మద్య, భారీ పరిశ్రమల స్థాపన ద్వారా వచ్చే ఆదాయం ద్వారా, NRI ల భాగస్వామ్యం తో ఇస్తాను అలాగే నీటి ప్రాజెక్ట్ లు ఎన్‌ఆర్‌ఐ మరియు ప్రజల సహకారం తో పూర్తిచేస్తాను, తప్ప అప్పు తెచ్చి ప్రజల మీద భారాన్ని మోపను, మోపలేను. హామీలు నెరవేర్చ లేను అనుకున్న మరుక్షణం నా పదవికి రాజీనామా చేయడానికి సిద్దం గా ఉన్నాను. దయచేసి మీరు మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని మరియు ఎన్నికల. ప్రచారానికి చేయూత(స్వచందంగా పాల్గొనే వారు ఉంటే మీ సహాయం ఇవ్వవలసినదిగా) అందించ వలసినదిగా కోరుతున్నాను. మీరు అందించే / అందించిన ప్రతిదీ ఎప్పటికీ అప్పుడు ప్రజలకు తెలిపరుస్తు ఉంటాను. మీరు అందించే ఈ ప్రతి చిన్న సహాయం పేపటి భవిష్యత్ తరానికి ఒక పునాది కావాలి, రాజకీయాల్లోకి రావాలి అనుకునే వాళ్ళకి ఒక ప్రేరణ కావాలి. ఒక ఆశాయం లేదా ఒక గమ్యం లేదా ఒక లక్ష్యం చేరాలి అంటే ఒకరి వలనే అవదు దానికి చేయూత, తోడ్పాటు, అందించే వాళ్ళు కూడా కావాలి. ఈ రోజు మనకు ఆ అవకాశం వచ్చింది.రండి చేయి చేయి కలుపుదాం అభివృద్ధికి ,రేపటి తరాల భవిష్యత్ కి పునాది వేద్దాం. ఒక్కసారి మీ అందరి సపోర్ట్ కోరుతున్నాను.